బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్
చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్‌గిడి బౌలింగ్‌లో అగర్వాల్ బౌల్డ్ అయ్యాడు.
కాసేపటికి రాహుల్(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ చేరాడు. ఎన్‌గిడి బౌలింగ్‌లోనే రాహుల్ క్లీన్‌బౌల్డ్ అయి, పెవిలియన్‌కు చేరాడు. భారీగా ఆశలు పెట్టుకున్న క్రిస్ గేల్(12), పూరన్(2), మన్‌దీప్ సింగ్(14), నీషమ్(2)లు నిరాశపరచడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ దీపక్ హుడా(62 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ తేరుకుంది.
శాఖాహారంతో పూర్తి ఫిట్‌నెస్..
సీఎస్‌కే బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా.. తాహీర్, శార్దూల్ ఠాకూర్, జడేజాలు తలో వికెట్ పడగొట్టారు.పంజాబ్ టాపార్డర్ నుంచి పెద్దగా మెరుపులు లేని సమయంలో హుడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడమే కాకుండా షాట్ల ఎంపికలో నియంత్రణ పాటించాడు. పంజాబ్ శిబిరంలో ఆందోళన నెలకొన్న సమయంలో హుడా తన ఇన్నింగ్స్‌తో మెరిపించాడు.
నూతన చట్టాలతో దేశానికి ప్రమాదం
ఈ మ్యాచ్‌లో తన బ్యాట్‌కు పూర్తి పని చెప్పాడనవచ్చు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్‌లో హుడాకు రెండో హాఫ్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో సాధించిన 62 పరుగులే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇది గౌరవప్రదమైన స్కోరు కాబట్టి పంజాబ్ బౌలర్లు ఎంతవరకు రాణిస్తారో చూడాలి మరి.