end
=
Friday, November 22, 2024
క్రీడలురెండో టెస్టులో భారీ మార్పులు..
- Advertisment -

రెండో టెస్టులో భారీ మార్పులు..

- Advertisment -
- Advertisment -

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మూడు రోజుల్లోనే మ్యాచును ఆసీస్‌కు అప్పగించింది భారత్‌. ఈ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లోనూ విఫలమైందని చెప్పవచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ మినహా.. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేదు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడను తలపించింది. 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. గాయం కారణంగా షమీ బ్యాటింగ్‌ చేయలేకపోయాడు.

కాగా, రెండో టెస్టుకు భారత్‌ ప్రత్యామ్నయాలను చూస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మిగితా మూడు మ్యాచులకు అందుబాటులో ఉండడు కనుక అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న కె ఎల్‌ రాహుల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఘోరంగా విఫలమవుతున్న యువ ఓపెనర్‌ పృథ్వీ స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గిల్‌ ఐపీఎల్‌లో విశేషంగా రాణించిన విషయం తెలిసిందే. అలాగే వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా స్థానంలో రిషభ్‌పంత్‌ను ఎంపిక చేసే అవకాశముంది. అతడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో మెరిశాడు. గాయంతో సిరీస్‌కు దూరమైన స్పీడ్‌స్టర్‌ మహమ్మద్‌ షమీ స్థానంలో హైదరాబాదీ బౌలర్‌ సిరాజ్‌ను జట్టులోకి తీసుకును అవకాశముంది. ఇక కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానే తీసుకోనున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -