end
=
Saturday, January 18, 2025
బిజినెస్‌Flipkart :Apple iPhone 14 పై భారీ డిస్కౌంట్
- Advertisment -

Flipkart :Apple iPhone 14 పై భారీ డిస్కౌంట్

- Advertisment -
- Advertisment -

  • రిపబ్లిక్ డే సందర్భంగా మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్

రిపబ్లిక్ డే సందర్భంగా మొబైల్ ప్రియులకు యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. యాపిల్ ఐ ఫోన్ (Apple iPhone) ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే (Flipkart Republic Day) సేల్‌లో ఐ ఫోన్ 14 (iPhone 14) భారీ డిస్కౌంట్‌కు అందించనున్నట్లు తెలిపింది. అంతేకాదు ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ (Flipkart Republic Day ) నడుస్తుండగా.. ఇందులో పలు ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు భారీ డిస్కౌంట్‌లతో వినియోగదారులకు అందించనుంది.

ఫ్లిప్ కార్ట్ లో రిపబ్లిక్ డే సేల్ (Flipkart Republic Day ) లో యాపిల్ ఐ ఫోన్ 14 (iPhone 14) రూ. 13 వేల భారీ డిస్కౌంట్ లో లభిస్తోంది. ఐ ఫోన్ 14 పై ఇంత భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం ఇదే తొలిసారి. రూ. 13 వేల డిస్కౌంట్ తో ఐ ఫోన్ 14 ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు రూ. 66,999 కి లభిస్తుంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో లాంచ్ అయిన సమయంలో ఈ iPhone 14 ధర రూ. 79,999 గా ఉంది. 128 జీబీ స్టోరేజ్ తో వచ్చే ఐ ఫోన్ 14 బేస్ మోడల్ కి ఈ ధర వర్తిస్తుంది. iPhone 14 256 జీబీ మోడల్ రూ. 76,999, అలాగే, iPhone 14 512 జీబీ మోడల్ రూ. 96,999 కి ఫ్లిప్ కార్ట్ సేల్ లో లభిస్తున్నాయి. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ లో ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Flipkart Axis Bank credit card) పై ఈ iPhone 14 ని కొనుగోలు చేసిన వారికి 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే, రూ. 21,400 వరకు ఎక్సేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి ఈఎంఐ (EMI) రూ. 6,089 నుంచి ప్రారంభమవుతుంది.

(74వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు)

Apple iPhone 14 స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్ ప్లే ఉంటుంది. డిస్ ప్లే కు సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. యాపిల్ A15 Bionic chipset ఉంటుంది. ఈ Apple iPhone 14 మిడ్ నైట్, పర్పుల్, స్టార్ లైట్, రెడ్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. షేక్స్, వైబ్రేషన్స్, మోషన్ లను అడ్జస్ట్ చేసేలా యాక్షన్ మోడ్ వీడియోను ఇందులో పొందుపరచగా..12 ఎంపీ ప్రైమరీ లెన్స్ కెమెరా ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -