న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది. పేలుడు దాటికి మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. గణతంత్ర దినోత్సవ బీటింగ్ రిట్రీట్‌కు కిలోమీటర్ దూరంలో ఘటన జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్ పోలీసులు, స్పెషల్ స్క్వాడ్ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. పేలుడు ఘటనతో బీటింగ్ రిట్రీట్ జరిగే చోట భద్రతలను కట్టుదిట్టం చేశారు. 5:45కు పేలుడు జరిగినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం అబ్దుల్ కలాం రోడ్డును మూసివేశారు. నిందితుల కోసం అధికారులు సీసీటీవీ ఫుటేజీని గమనిస్తున్నారు.