end
=
Sunday, January 19, 2025
సినీమాచిరు సినిమా కోసం 16 ఎకరాల్లో భారీ సెట్‌
- Advertisment -

చిరు సినిమా కోసం 16 ఎకరాల్లో భారీ సెట్‌

- Advertisment -
- Advertisment -

మెగాస్టార్ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్ జంటగా నటించనున్న లేటెస్ట్‌ మూవీ ‘ఆచార్య’. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివార్లలో 16 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్‌ వేశారు. ఆర్ట్‌ డైరెక్టర్స్‌ ఆ సెట్లో ఓ ఊరిని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ దేవాలయం, యజ్ఞశాల, మరి కొన్ని చారిత్రక కట్టడాలు నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇందుకు గాను రూ.25 ఓట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరుతో పాటు పలువురు ముఖ్య తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. పలు ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఆయన జనవరి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -