end
=
Friday, November 22, 2024
బిజినెస్‌భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Advertisment -

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ ముందు బంగారం ప్రియులకు శుభవార్త. నేడు పసిడి ధరలు కనీవినీ ఎరుగని స్థాయిలో పతనమయ్యాయి. అమెరికా సహా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు నేలచూపులు చూశాయి.10 గ్రాముల పసిడి ధరపై ఏకంగా రూ. 2 వేలకు పైగా తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి గోల్డ్ ఫీచర్స్ 4 శాతం తగ్గి పది గ్రాములకు రూ. 2,086 క్షీణించి రూ. 48,818 వద్ద ముగిసింది.

ప్రపంచ మార్కెట్లలో స్పాట్‌గోల్డ్ దాదాపు 4 శాతం క్షీణించి ఔన్సుకు 1,833 డాలర్లకు పడిపోయింది. ఇక, ఢిల్లీలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 49, 650గా ఉండగా, 24 క్యారెట్ బంగారం 54,160గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ బంగారం ధర పది గ్రాములకు రూ.49,820గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ. 50,820 నమోదైంది. కోల్‌కతాలో 22 కేరెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 50,190, 24 క్యారెట్ గోల్డ్ రూ. 52,890గా, చెన్నైలో 22 క్యారెట్ బంగారం ధర రూ. 47,920, 24 క్యారెట్ బంగారం రూ. 52,270గా, బెంగళూరులో 22 క్యారెట్ బంగారం ధర రూ. 47,500, 24 క్యారెట్ బంగారం ధర రూ. 51,800గా నమోదైంది.

అదే సమయంలో వెండి ధరలు మరింత దారుణంగా పతనమయ్యాయి. కిలోకు ఏకంగా రూ. 6,100 (8.8 శాతం) తగ్గి 63,650కు పడిపోయింది. నిన్న కూడా దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు బాగా పతనమయ్యాయి. పది గ్రాములకు 614 రూపాయలు క్షీణించి 49,763కు పడిపోయింది. వెండి ధరలు కూడా కిలోకు రూ. 1,609 తగ్గి రూ. 69,127 నుంచి రూ. 67,518కి పడిపోయాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -