end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంమానవత్వం చాటిన పోలీసులు
- Advertisment -

మానవత్వం చాటిన పోలీసులు

- Advertisment -
- Advertisment -

ఓ వైపు విధులు.. మరోవైపు సేవలు ఇది నేటితరం పోలీసుల తీరు. ఒకప్పుడు పోలీసులంటే అతిభయంకరమైన వ్యక్తులుగా ముద్ర పడింది. కానీ, కాల క్రమేణా చట్టాలు మారడం, వ్యక్తిగతంగా వారు కూడా విధులతో పాటు నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. వేములవాడలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులు యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో, ఆయా ప్రాంతాలలో నివసించే యాచకులకు, వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానం పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న యాచకులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండవసారి పోలీసులు దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పట్టణ ఎస్సై రామచంద్రం గౌడ్ చేతుల మీదుగా చలిలో నిద్రిస్తున్న అనాథ వృద్ధులు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు యువ ఫౌండేషన్‌ సభ్యులు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. యువ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకుడు, కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ సారధ్యంలో నిరుపేదలకు స్వచ్ఛందంగా సేవలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా నేటి యువతకు యువ ఫౌండేషన్ కార్య నిర్వాహక సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సంస్థ చేస్తున్న సేవలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఆయనతెలిపారు.

తదనంతరం యువ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువ అవుతుందనే ఆలోచనతో గత రెండు రోజుల నుంచి సిరిసిల్ల, వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలతో పాటు ఆయా ప్రాంతాలలో నివసించే యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మానవతా వాదులు స్పందించి తమ తమ ప్రాంతాలలో ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి సహాయం అందించాలని అంతేకాకుండా ఎవరైనా కొత్త దుప్పట్లు దానం చేయాలనుకుంటే మా యువ ఫౌండేషన్ ని సంప్రదిస్తే మా ఫౌండేషన్ సభ్యులు వాటిని నిరాశ్రయులకు అందిస్తారని ఆయన తెలిపారు.

చలి తీవ్రతలో నిద్రించే యాచకులు, అనాథ వృద్ధులకు కప్పుకోడానికి దుప్పట్లు ఇచ్చి మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఒకవైపు విధినిర్వహణలో తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. మరోవైపు నిరుపేదలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న పట్టణ పోలీసులను ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో యువ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు బొంగాని శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్, కోశాధికారి తడుక గణేష్, సభ్యులు నవీన్, నరేష్, మహేష్, వివేక్, పరుష రాము, రాజు, సాగర్ పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -