ప్రేమించాడు, పెళ్లిచేసుకున్నాడు. పండంటి పాప. విధి వింతనాటకం. రెండేళ్లకే భార్యమరణం. ఈ మనోవేధనతో భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ ఘటన రాజంపేట మండలం కొండాపూర్‌లో జరిగింది. ఎస్ఐ రాజు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన సురేష్ నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పాప పుట్టింది. అయితే భార్య అనారోగ్యంపాలవంతో పెళ్లయిన రెండేళ్లకే భార్య మరణించింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త సురేష్ తరుచూ భార్య సమాధి వద్దకు వెళ్లి రోధించేవాడు. ఆమెను మరిచిపోలేక సమాధి వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు సురేష్ తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
- Advertisment -
భార్య మృతి భరించలేక భర్త ఆత్మహత్య
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -