end

నేరాలకి అడ్డాగా హైదరాబాద్‌…!

హైదరాబాద్‌ నేరాలకి అడ్డాగా మారింది. ఇటీవల జరిగిన అమ్నీషియా పబ్ కేసు ఘటన మరవక ముందే.. అలాంటివే మరో రెండు దారుణాలు వెలుగులోకి… రాష్ట్ర రాజధాని లో అమ్మాయిలపై ఆగడాలు చేయడం ఆగట్లెధు. ఓ ఈవెంట్ మేనేజర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను లోబర్చుకోగా.. మరో ఘటనలో ఓ క్యాబ్ డ్రైవర్‌ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేశాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన మహ్మద్‌ సూఫియాన్‌ (21) అనే ఈవెంట్‌ మేనేజర్. చార్మినార్ దగ్గరలో పనిచేస్తున్న అమ్మాయితో పరిచియం పెంచుకొని ప్రేమిస్తున్నాని పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు.

నెల 30 న రాత్రి అతడు బాలికను లంగర్‌హౌస్‌లోని ఇంటికి తీసుకెళ్లి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మరుసటి రోజు ఆమెను పనిచేసే షాపు దగ్గర వదిలేసి వెళ్లాడు. తర్వాత బాలికకు బాగా కడుపునొప్పి తో బాధపడటం చూసిన తల్లి నిలదీయటంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలి కాలాపత్తర్‌ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో ఓ బాలికను ఇంటికి తీసుకెళతానని నమ్మించి క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌ చేశాడు. అతడు, స్నేహితుడు కలసి అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఐదు రోజుల కిందట ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. షాహీన్‌నగర్‌కు చెందిన ఓ బాలిక (12) పాతబస్తీ సుల్తాన్‌షాహీలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ స్కూల్‌లో చదువుకుంటోంది.

గత నెల 31న సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లో చెప్పకుండా ఆమె షాహీన్‌నగర్‌లోని తల్లిదండ్రుల వద్దకు బయల్దేరింది. ఈ క్రమంలోనే పహడీషరీఫ్‌ కమాన్‌ వద్ద ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన కిషన్‌బాగ్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ షేక్‌ కలీం అలీ (36) షాహీన్‌నగర్‌కు తీసుకెళ్తానంటూ క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే మాయమాటలు చెబుతూ రాత్రి 11 గంటల వరకు క్యాబ్‌లో తిప్పాడు. అనంతరం షాద్‌నగర్‌ కొందుర్గ్‌లో డెయిరీఫాం నిర్వహిస్తున్న మిత్రుడు మహ్మద్‌ లుక్మాన్‌ అహ్మద్‌ యాజ్దాని అలియాస్‌ లుక్మాన్‌ (34)కు కాల్ చేసి రప్పించాడు. ఇద్దరూ బాలికను కిడ్నాప్‌ చేసి కొందుర్గ్‌లోని లుక్మాన్‌ ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించటంతో బాలిక ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో నిందితులు కంగుతిన్నారు.

ఈ క్రమంలోనే కలీం అలీ..తిరిగి బాలికను క్యాబ్‌లో ఎక్కించుకుని తెలవారుజామున ఉదయం 5 గంటలకు సుల్తాన్‌షాహీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడు. అయితే బాలిక కనిపించడంలేదంటూ కుటుంబసభ్యుల అంతకుముందే మొఘల్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ బాలిక పోలీస్‌స్టేషన్‌ ముందు నుంచి నడుస్తూ వెళ్లటం గుర్తించిన పోలీసులు.. ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version