end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంHyderabad: గాంధీ ఆసుపత్రిలో సరికొత్త మార్పులు
- Advertisment -

Hyderabad: గాంధీ ఆసుపత్రిలో సరికొత్త మార్పులు

- Advertisment -
- Advertisment -

హరీష్ రావు(Harish Rao)మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్  విషయంలో ఒక నీతి, రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ కాలేజీ(Medical College)ల విషయంలో ఒక నీతి అన్నట్టుగా  వ్యవహరిస్తోంది.ఒకే దేశంలో ఉన్న  మెడికల్ కాలేజీల విషయంలో ద్వంద్వ పద్ధతి  సారి కాదు.ఎన్ ఎం సి నిబంధనలు ఎయిమ్స్ కి ఎందుకు వర్తించదు.  వైద్య విద్య విషయంలో కేంద్రానికి ఒక పాలసీ, రాష్ట్రానికి  ఒక పాలసీ ఎందుకు.ఆపరేషన్ థియేటర్ లు, ప్రొఫెసర్(Professor) లు లేకుండానే ఎయిమ్స్ ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులను నిమ్స్ ని చూసి … బీబీ నగర్ ఎయిమ్స్ ని ఒకసారి విజిట్ చేయాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ విద్యార్థుల భవిష్యతుని దృష్టిలో ఉంచుకుని భువనగిరి(Bhuvanagiri)  ఆసుపత్రిలో  ట్రైనింగ్ కి అనుమతి ఇచ్చాము.ఎయిమ్స్ కి 200 ఎకరాల భూమి, రూ.200 కోట్ల విలువైన భవనాలు ఉచితంగా ఇచ్చాము. రూ.500 కోట్ల ఆస్తి ఇస్తే ప్రజలకి ఒరిగింది ఏమి లేదు.ఎయిమ్స్ ఏర్పాటు చేసి 3 ఏళ్ళు అయినా వసతులు ఏర్పాటు లేదు.  కేంద్ర మంత్రులు మా వైద్యుల మనోస్థైర్యం దెబ్బ తీసేలా మాట్లాడటం తగదు.కేంద్రమంత్రులు రాజకీయం చేయడానికి వస్తున్నారా… అభివృద్ధి కోసం వస్తున్నారా.

అభివృద్ధి చేయాలనుకుంటే… బీబీ నగర్ ఎయిమ్స్మీరు రాష్ట్రానికి రావొచ్చు.. మేము స్వాగతిస్తున్నాము. ఉట్టి చేతులతో రావొద్దు. తెలంగాణకు ఏదైనా ఇచ్చి వెళ్ళండి లేదా.. తెలంగాణను చూసి నేర్చుకొని వెళ్ళండి. 150 కి పైగా దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఇస్తే… అందులో ఒక్కటి తెలంగాణ(Telangana)కు దక్కలేదు. మేమే కష్టపడి కళాశాలలు నిర్మించుకుంటే కావాలని కొర్రీలు పెడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుకు ఎయిమ్స్, ప్రభుత్వ ఆస్పత్రులే  నిలువుటద్దాలు.కేంద్ర మంత్రులు ఇక్కడ చూసి నేర్చుకుని వాళ్ళ రాష్ట్రాలకు వెళ్లి అమలు చేస్తే మరింత సంతోషిస్తాము.మీ రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు భీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఉన్నాయా.రాష్ట్రానికి వారానికి ఒకసారి వచ్చే కేంద్ర మంత్రులు ఇక్కడ నేర్చుకోండి… లేదా మీ శాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులు అయినా చేయండి.

 కేంద్రం నిన్న ప్రకటించిన అవార్డ్స్ లో  బెస్ట్ స్టేట్, బెస్ట్ డిస్ట్రిక్ , ఒడిఎఫ్++ వంటి అనేక అవార్డ్స్ తెలంగాణ కె వచ్చాయి. మేము పని చేయకుండానే వచ్చాయా?. అవార్డులు ఇచ్చేది మీరే… మళ్ళీ అనేది మీరేనా?. గాంధీలో మంచి వైద్య సేవలు అందుతున్నాయి. దవాఖాన సామర్థ్యం 1500 పడకలు.. కానీ ఈరోజు 1683 మంది ఇన్ పేషంట్లు ఉన్నారు. అంటే సామర్థ్యానికి మించి పని చేస్తున్నారు. గాంధీపై ప్రజల నమ్మకానికి నిదర్శనం. Corona సమయంలో గాంధీ సిబ్బంది చేసిన సేవలు అద్భుతం. MRI యంత్రం ద్వారా 3-4 నెలల్లో 1400 స్కానింగ్ జరిగాయి. కోటి విలువైన సేవలు ఉచితంగా అందాయి. కేథ్లాబ్ 504 ప్రొసీజర్ పూర్తి. హై ఎండ్ ultrasound యంత్రాలు 30-45 రోజుల్లోగా అందుబాటులోకి వస్తాయి.200 బెడ్ MCH నాలుగైదు నెలలలో అందుబాటులోకి వస్తాయి. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్  6 నెలల్లో అందుబాటులోకి.. ఇన్ఫర్టిలిటీ సెంటర్ 3 నెలల్లో అందుబాటులోకి వస్తాయి.వైరింగ్ కోసం  13.55 కోట్లతో టెండర్లు పూర్తి. డ్రైనేజీ పైప్ లైన్ కోసం 14 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యింది. బస్తీ దాకానాల వల్ల గాంధీ ఉస్మానియా వంటి హాస్పిటల్ పై ఓపి లోడు తగ్గింది. ఇది ప్రభుత్వం సాధించిన విజయం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -