end

Hyderabad:హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.

మంత్రి హరీశ్ రావు(Harish Rao) మాట్లాడుతు కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం ఎంతో అవసరం. రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరం. తద్వారా రికవరీ పెరుగుతుంది. పేషెంట్ ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గి, వారికి బిల్ తగ్గుతుంది. బెస్ట్ ట్రీట్మెంట్ తో పాటు, అఫర్డబుల్ ట్రీట్మెంట్ అందించాలి. చికిత్స కోసం ఎంతోమంది హైదారాబాద్ వస్తున్నారు. మెడికల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్(CM KCR) గారు చేస్తున్న కల్పిస్తున్న అవకాశాల వల్ల  ఇక్కడ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మూడు Tims ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నది. కేర్ ఆసుపత్రి(Care Hospital) కూడా ఆరోగ్య శ్రీ కేసులు బాగా తీసుకోవాలని కోరుతున్నా.

ఏడాదికి 1000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మీరు కూడా పేదలకు మంచి వైద్యం అందించాలి. ఈ విషయంలో ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలంగాణ ఐటీ ఉద్యోగులు ఉంటారు. మెడికల్ లో కూడా అలాగే చేస్తున్నాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ(Medical College) ప్రారంభిస్తున్నాము. 233 పీజీ సీట్లు యాడ్ చేస్తున్నాం. నాడు యూజీ సీట్లు 800 సీట్లు ఉంటే 2840 కు పెంచాము. ఆసుపత్రి అడ్మనిస్ట్రేషన్ బలోపేతం చేస్తున్నాం.11,440 కోట్లు హెల్త్ కోసం బడ్జెట్ ఐటీ లో మనం ఎలాగ మేటిగా ఉన్నామో వైద్యంలో కూడా అవుతాం పెట్టుకున్నాం. సాధారణ డెలివరీలు పెరగాలి. సర్జరీలు తగ్గాలి. ఆడిట్ చేస్తున్నాం. ప్రైవేట్ లో కూడా చాలా తగ్గాలి. అవసరం ఉన్న పరీక్షలు మాత్రమే చేయాలి. కార్పొరేట్ ఆసుపత్రుల(Corporate Hospital) మీద కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఉంటుంది. అది ఉండకూడదు.

Exit mobile version