end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంHyderabad: దారి తప్పిన బుల్లెట్ బండి పెళ్లి కొడుకు
- Advertisment -

Hyderabad: దారి తప్పిన బుల్లెట్ బండి పెళ్లి కొడుకు

- Advertisment -
- Advertisment -

చాలామంది లంచం తీసుకుంటూ సంతోషం గా బ్రతుకుతున్నారు దొరికితే దొంగ దోరకపోతే రాజే కదా…వివరాల్లోకి వెళ్తే బ‌డంగ్‌పేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(Municipal Corporation) ప‌రిధిలో టౌన్ ప్లానింగ్ సూప‌ర్‌వైజ‌ర్‌గా పని చేస్తున్న అశోక్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు.ఇంటి నిర్మాణ అనుమ‌తి కోసం స‌రూర్‌న‌గ‌ర్‌కు చెందిన ఏ దేవేంద‌ర్ రెడ్డి అశోక్‌ను కలిసాడు. మ‌ధ్య‌వ‌ర్తి శ్రీనివాస్ రాజు(Private Architecture) ద్వారా అశోక్ రూ. 30 వేలు లంచం కచ్చితంగా కావాలి అనడంతో బాధిత వ్య‌క్తి ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. దీంతో ఈ రోజు లంచం తీసుకుంటుండ‌గా అధికారులు ప‌ట్టుకున్నారు. అశోక్‌తో పాటు శ్రీనివాస్ రాజును కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అశోక్‌ (Ashok) నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఆయన ఆస్తులు, ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీస్తున్నారు. అయితే అశోక్ బుల్లెట్ బండి ఫేమ్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయ‌న పెళ్లి డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఒక రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేసింది. 2021, ఆగ‌స్టు 14న మంచిర్యాల(Mancherial) జిల్లా జన్నారానికి చెందిన యువతితో రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌ వివాహం జరిగింది. అప్పగింతలు జరిగే సమయంలో వధువు బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తావా.. అనే పాటకు  చేసిన  డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు కూడా అంతే వేగంగా సోషల్ మీడియా(Social Media)లో అశోక్‌ పేరు అవినీతి అధికారి ఇతనే అంటూ ఈ వార్త వైరల్ అవుతోంది.

(అమ్మాయిలు జర అచి తూచి అడుగు వేయండి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -