ప్రభాస్ చిత్రం కథానాయిక స్పందన
పాన్ ఇండియన్ స్టార్(Pan indian star) ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ సినిమాల్లో మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవ పూడి(Director Hanu Raghavapudi) తీసే చిత్రం ఒకటి. ఈ చిత్రంలో కథానాయికగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ ఇమాన్వీ ఇస్మాయిల్(Actress Imanvi Ismail) నటించబోతున్నది. ఇప్పటికే చిత్ర షూటింగ్‌కు నిర్మాతలు కొబ్బరికాయ సైతం కొట్టేశారు. ఇవాళో రేపో శరవేగంగా షూటింగ్ చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగింది.
మొత్తం 26 మంది పర్యాటకులు మృతిచెందారు. అయితే.. ఇప్పుడా ఘటనకు ఇమాన్వీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇమాన్వీ పాకిస్థానీ అని, ఆమెను ప్రభాస్ చిత్రం నుంచి తొలగించాలనే డిమాండ్ మొదలైంది. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇమాన్వీ తండ్రి పాకిస్థాన్ మిలిటరీలో పనిచేశారని, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డ ఆమె ప్రభాస్‌తో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఇమాన్వీ తాజాగా సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. “మా కుటుంబం నుంచి ఎవరికీ పాకిస్థాన్ మిలిటరీతో సంబంధం లేదు.
ఈ ప్రచారం ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు. నిజానిజాలు తెలుసుకోకుండా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారం నన్నెంతో బాధించింది. నేను ఒక భారతీయురాలిని. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లిష్ మాట్లాడతాను. మా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. వారు అమెరికా పౌరులు. నేను అమెరికాలో చదివాను. తర్వాత నటి, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ కావాలనే కోరిక పుట్టింది. సోషల్ మీడియాలో నా డాన్స్ చూసి కొందరు నాకు సినిమా అవకాశం ఇస్తున్నారు. నేను భారతీయురాలిగా గర్వపడుతున్నాను. దయచేసి నాపై తప్పుడు ప్రచారం చేయకండి` అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.