హిందీ టెలివిజన్ నటుడు ఆశిష్‌తో లిప్‌లాక్(Liplock) సన్నివేశంపై నటి సోనారికా భడోరియా(Sonarika Bhadoria) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 2018లో వచ్చిన ‘పృథ్వీ వల్లభ్’ ధారావాహికలో వీరిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్ తెరకెక్కించగా ఇది చర్చనియాంశమైంది. కాగా ఇటీవల ఓ ఇంటరాక్షన్(Interaction)లో ఎదురైన ప్రశ్నలకు బదులిచ్చిన ఆమె.. తన నిజ జీవితంలో ఇప్పటివరకూ ఎవరితో ముద్దు(Kiss) పంచుకోలేదని స్పష్టం చేసింది.
అలాగే ఆ సీరియల్‌లో ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడానికి తామిద్దరం నిర్మొహమాటంగా నిరాకరించామని, తమ మధ్య లిప్ లాక్ సన్నివేశం ప్లాన్ చేసినప్పటికీ ఆన్ స్ర్కీన్(Screen)పై అలా చేయలేమని చెప్పడంతో మనోభావాలను గౌరవించి మేకర్స్ రిజెక్ట్(Reject) చేసినట్లు తెలిపింది. అయితే ఆ సన్నివేశం స్క్రిప్ట్‌లో అంతర్భాగమైనందున కెమెరా యాంగిల్స్ మార్చి అలా చూపించారన్న నటి.. ఆ ఫొటోలు వైరల్ కావడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది. చివరగా TRP రేటింగ్‌ల కోసం హద్దులు మీరాలనుకోవట్లేదని క్లారిటీ ఇచ్చిన సోనా.. ఇతరులతో తన పెదాలను లాక్ చేయడాని ఎలాంటి భయం లేనప్పటికీ భవిష్యత్తులో అత్యవసరమైతే తప్పకుండా చేస్తానని వెల్లడించింది.
(Kajol:30 ఏళ్ల తర్వాత కలిసి నటించిన జోడి)