end

పొట్టి బట్టలు వేసుకోకుండానే అందంగా కనిపిస్తా….

హీరోయిన్ సాయి పల్లవి సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా హాట్ డ్రెస్సుల్లో కనిపించకుండానే సాయి పల్లవి స్టార్ హీరోల స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. పొట్టి బట్టలు వేసుకోకుండానే అందంగా కనిపిస్తూ కుర్ర హృదయాలు కొల్లగొడుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఆమెకు అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా అద్భుతమైన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్‌ చేస్తోంది ఈ నేచులర్‌ బ్యూటీ.వెండితెరపై సాయి పల్లవి పొట్టి పొట్టి బట్టలు వేసుకోదు. దీని గురించి పలుమార్లు స్పందించిన సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఓపెన్ అయింది. పొట్టి బట్టలు తనకు సౌకర్యవంతంగా ఉండవని పేర్కొంది. తనకు పొట్టి బట్టలు ఎందుకు సౌకర్యవంతంగా ఉండవో కూడా సాయి పల్లవి వివరణ ఇచ్చింది.

ప్రేమమ్ చిత్రంలో డాన్స్ కోసం స్ప్లిట్ డ్రెస్ లో కనిపించాను. ఆ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయింది. అందరూ ఆ డ్రెస్ ని పాస్ చేసి మరీ చూడడం ప్రారంభించారు. జనాలు నన్ను అలా చూడడం నాకు ఇష్టం లేదు. విదేశాల్లో ఎలాంటి బట్టలు వేసుకున్నా అక్కడి ప్రజల చూపుల్లో తేడా ఉండదు. కానీ ఇక్కడ పొట్టి బట్టలు వేసుకుంటే నాకు సౌకర్యంగా అనిపించదు. అందుకే పొట్టి బట్టలకు నేను దూరంగా ఉంటాను. ఎవరి ఇష్టం వారిది. నేను ఎలా ఉండటమే నాకు ఇష్టం అని పేర్కొంది. పొట్టి బట్టలు వేసుకోవడం నేను తప్పు అని చెప్పను.చూసే కోణంలోనే ఉంటుంది.


ప్రస్తుతం సాయి పల్లవి రానా సరసన విరాట పర్వం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది.


Exit mobile version