end

సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు కోవిడ్‌

తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి, ఐఎఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆమె ట్వీట్‌ చేశారు. అయితే తాను హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. తనతోపాటు గత వారం రోజులుగా పని చేసిన ఫీల్డ్‌ అధికారులు, ఇతరులు కోవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.

స్మితా సబర్వాల్‌ 2001 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి, అమె భర్త ప్రముఖ ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌. వీరిద్దరు అత్యంత చురుకుగా రాష్ర్టానికి సేవలందిస్తున్నారు. ప్రజల మన్ననలు చూరగొన్నారు. ఎందరికో ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారులుగా స్పూర్తినిచ్చారు. ఆమె తర్వగా కోలుకోవాలని అభిమానులు, అధికారులు కోరుకుంటున్నారు.

Exit mobile version