తాము జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే.. నగరంలో అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు వరద సాయం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న దానికంటే రెట్టింపు ఇస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం.. పీఎంని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదన్నారాయన. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది. ఎన్నికల్లో గెలవగానే ఆ ఫ్రంటూ.. ఈ ఫ్రంటూ అన్నారు. చివరకు ఏ టెంటూ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ దుకాణం మొదలుపెట్టారు. రాష్ట్రంలో హిందువులను ఉండనిస్తారా లేదా. కేసీఆర్ ఎంఐఎంకి వత్తాసు పలుకుతున్నారు. రేపటి నుంచి కేసీఆర్ చరిత్ర బయటపెడతాం. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా’ అంటూ సవాలు విసిరారు బండి సంజయ్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని మేయర్ చేస్తే.. ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు ఇస్తాం. వరద నష్టం అంచనా వేసి… నష్టాన్ని పూరిస్తాం. ప్రజల ఆస్తులకు భరోసా లేదు. కేసీఆర్ దేశ ద్రోహి. ఆయనకి ఇంగితజ్ఞానం లేదు. భాగ్యనగరం దేశభక్తుల అడ్డా. ఆలేరులో దేశద్రోహి వికారుద్దీన్‌ని కేంద్ర బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. విమర్శలు ప్రజాస్వామ్య బద్దంగా చేయాలి’ అన్నారు.
తెలంగాణలో కచరాను సాఫ్ చేయాలని అనుకుంటున్నాం. పెడితే పెళ్లి కోరుతారు… లేకుంటే చావు కోరుతారు. 6 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి. టీఆర్ఎస్ గత ఎన్నికల మ్యానిఫెస్టో వెబ్‌సైట్‌లో లేకుండా చేసినా.. మా దగ్గర ఉంది. బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేసింది. రామ మందిర నిర్మాణం చేపట్టింది. సీఏఏ అమలు చేశాం. ముస్లిం మహిళలను కాపాడటానికి ట్రిపుల్ తాలక్‌ని రద్దు చేశాం. హరితహారం, రైతు వేదికకు కేంద్రమే నిధులు ఇచ్చింది’ అన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.