- జగన్, చంద్రబాబు కలసి మోడీకి మసాజులు చేస్తున్నారు
ఏపీ రాజకీయాల(AP Politics)పై తనదైన స్టైల్‌లో స్పందించారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul). చంద్రబాబు ఏం చేసినా కొడుకు కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదన్నారు. లక్షల కోట్లు అప్పు చేసిన జగన్(Jagan)కి మళ్లీ పాలన పగ్గాలిస్తే ఇబ్బందేనని చెప్పారు. ఏపీలో 100కి 60 శాతం ప్రజలు తననే కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. కుల కుటుంబ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్పలాభం లేదని రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్దం అవుతోందన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేనకు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనన్నారు. తనను గెలిపిస్తే ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు.
ఏపీలో పరిస్థితులు విషమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన కేఏ పాల్.. సీఎం జగన్ తనకు కేవలం 30 నిమిషాల సమయమిస్తే.. ఇద్దరం కలసి రాష్ట్రం అప్పు(Debt) తీర్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు సీఎం(Chandrababu)గా ఉన్నపుడు ఇబ్బంది పెట్టారని జగన్ సీఎం అయ్యాక ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. జగన్ ఎన్నికల ముందు 25 ఎంపీలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇపుడు జగన్, చంద్రబాబు కలసి మోడీకి(PM Modi) మసాజులు చేస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ ఇందిరా గాంధీని ఎదిరించారు. ఇప్పుడు తెలుగు వారి సత్తా ఏంటో కేంద్రానికి తెలియాల్సిన అవసరముందన్నారు.