బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.. తనను సోషల్ మీడియా(Social Media)లో చేరడానికి ప్రేరేపించిన విషయాన్ని వెల్లడించాడు. సాధారణంగా మీడియా ప్రెస్‌మీట్‌లు, ఈవెంట్లతో(Event)పాటు నెట్టింటికి దూరంగా ఉండే ఆయన ఇటీవలే అంతర్జాలంలో యాక్టివ్ అవ్వాలనే కోరిక పుట్టిందని చెప్పాడు. నిజానికి తనను ఫొటోజెనిక్(Photojenic) వ్యక్తిగా పేర్కొంటారని, అయినప్పటికీ తనకు సంబంధించిన చిత్రాలపై ప్రజలు భిన్నమైన కామెంట్లు చేయడంతో పోస్ట్ చేయాలా వద్దా అనే దానిపై ఘర్షణ పడ్డట్లు తెలిపాడు. అలాగే తన ఖాతాను నిర్వహించడానికి ముందు తన మేనేజర్‌తో మాట్లాడాతానన్న హీరో.. ‘నిజాయితీగా లక్ష మంది ఫాలోవర్లను కలిగి ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసినపుడు ఎవరూ పోస్ట్ చేయలేరు. అందుకే అందులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఇటీవల నన్ను అలా చేయమని టెంప్ట్(Tempt) చేసేది డబ్బు మాత్రమే’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇక ‘విక్రమ్ వేద(Vikram Veda)’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంపై మౌనం వీడిన సైఫ్.. ‘సినిమా నిరాశపరిచింది నిజమే. కానీ, తర్వాత ఏమి జరుగుతుందో నాకు తెలియదు. ప్రజలు సినిమాలు చూడటం మాత్రం కొనసాగిస్తారు. మేము తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. పెట్టుబడి ధరలు, వసూళ్లు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయి’ అంటూ డిజప్పాయింట్(Disappointment) అవ్వాల్సిన అవసరంలేదన్నాడు.
(Kangana Ranaut:ఆమె ఒంటిచేత్తో బాలీవుడ్‌ను కాపాడుతోంది..)