end
=
Sunday, January 19, 2025
క్రీడలుCricket:జింబాబ్యే భారత్‌‌ను ఓడిస్తే అలా చేస్తా.. పాకిస్తాన్ నటి
- Advertisment -

Cricket:జింబాబ్యే భారత్‌‌ను ఓడిస్తే అలా చేస్తా.. పాకిస్తాన్ నటి

- Advertisment -
- Advertisment -
  • మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సెహర్ షిన్వారీ
  • రోహిత్‌ సేనను చిత్తుచేయాలని చేసిన ట్వీట్ వైరల్


పాకిస్తాన్ హీరోయిన్‌ (Pakistan Actress) సెహర్‌ షిన్వారీ (Sehar Shinwari) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. గతంలోనూ టీమిండియా (INDIA)పై ఎన్నోసార్లు అక్కసు వెళ్లగక్కిన ఆమె.. తాజాగా జింబాబ్వే (Zimbabwe)రోహిత్‌ (Rohith)సేనను చిత్తుచేస్తే ఆ పని చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ (Shocking comments)చేసింది. ఈ మేరకు నవంబర్‌ (November)6న భారత్- జింబాబ్యే మధ్య సూపర్ 12లో భాగంగా చివరి మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షిన్వారీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో (social media) చర్చనీయాంశమయ్యాయి.

ఆస్ట్రేలియా (Australia)వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ (pakisthan)పేలవ ప్రదర్శన చేస్తోంది. టీమిండియా (india), జింబాబ్వే (zimbabwe) చేతుల్లో చావు దెబ్బతిన్న ఆ జట్టు సెమీస్‌ (semis)అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నాకైట్‌ రేసుకు (nackout)చేరుకోవాలంటే ఆజట్టు దక్షిణాఫ్రికా (soth africa), బంగ్లాలపై (Bangladesh)కచ్చితంగా గెలవడంతో పాటు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంది. ఇదే నేపథ్యంలో టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్‌ 12 ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనున్న రోహిత్ సేన ఆ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి (first place) చేరుకోవచ్చు. ఇదిలా ఉంటే టీమిండియాపై గతంలో ఎన్నోసార్లు అక్కసు వెళ్లగక్కిన పాక్‌ హీరోయిన్‌ సెహర్‌ షిన్వారీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నవంబర్‌ 6న జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే.. రోహిత్ సేనను చిత్తుగా ఓడిస్తే ఆ దేశపు వ్యక్తినే పెళ్లిచేసుకుంటానని (marriage) తెలిపింది. ‘తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతంగా భారత్‌ను ఓడించినట్లయితే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా’ అంటూ ట్వీట్‌ చేసింది.

అయితే ఆమె ఇలా మాట్లాడటం మొదటిసారి కాకపోగా.. అప్పట్లో కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద పోస్టులతో (contraversy)వార్తల్లో (post)నిలిచింది. నిన్న జరిగిన బంగ్లాదేశ్‌- భారత్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా రోహిత్‌ సేన ఓడిపోవాలని పదే పదే ట్వీట్లు (tweets) పెట్టింది. అంతకుముందు స్వదేశంలో టీ20 సిరీస్‌లో (T20 Series)భాగంగా ఆసీస్‌ చేతిలో టీమిండియా ఓడిపోయినపుడు కూడా టీమిండియాపై ఇలాగే విమర్శలు చేసింది. అయితే పాకిస్తాన్‌ హీరోయిన్‌ చేసిన ట్వీట్‌పై క్రికెట్‌ లవర్స్‌ (cricket lovers), టీమిండియా అభిమానులు (fans) ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. భారత్‌- బంగ్లా మ్యాచ్‌ సమయంలో ఆమె అంచనాలు తప్పాయి. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. జీవితమంతా (life long)పెళ్లి లేకుండా (with out marriage) ఒంటరిగా (alone)ఎలా జీవిస్తారో తలుచుకుంటేనే బాధగా ఉందంటూ దారుణంగా ట్రోల్‌ (troll) చేస్తున్నారు. జింబాబ్వే చేతిలో ఓడిపోవడానికి మాది పాకిస్తాన్‌ జట్టు కాదంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ హల్ చల్ (viral)చేస్తోంది.

(ACB Raid : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇన్‌చార్జి తహశీల్దార్‌)

ఇదిలావుంటే.. రీసెంట్‌గా జరిగిన మ్యాచ్‌లో భారత్ (india)5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ (bangladesh)ను ఓడించింది. అయితే మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ (wicket keeper and batsmen))నూరుల్ హసన్ (Nurul Hasan) కోహ్లీని (kohli)నిజాయితీపరుడు కాదని ఆరోపణలు (complaint) గుప్పించాడు. అయితే ఈ ఆరోపణ నూరుల్ మెడకు చుట్టుకుంటుందని, అతడిపై కఠిన చర్యలు (Strict measures)తీసుకోవచ్చని తెలుస్తోంది.నవంబర్ 2 బుధవారం అడిలైడ్‌ (Adelaide)లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఇందులో వర్షం (rain)అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. వర్షం ధాటికి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఛిన్నాభిన్నం కావడంతో విజయానికి అతి చేరువలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం హసన్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ అని ఆరోపించాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే ముందు, ఏడో ఓవర్‌లో (over)ఫేక్ త్రో (fake trow)చేశాడని, అందులో తమ జట్టుకు పెనాల్టీగా (fenalti) ఐదు పరుగులు (5 runs)రావాల్సి ఉందని, కానీ, అది రాలేదని హసన్ ఆరోపించాడు.

ఫేక్ ఫీల్డింగ్ కేసు ఏమిటి?


నిజానికి, ఏడో ఓవర్‌లో నజ్ముల్ శాంటో, లిట్టన్ దాస్ (Nazmul Santo, Litton Das)ఒక షాట్‌పై రెండు పరుగులు చేస్తున్నారు. ఈ సమయంలో, అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) బంతిని విసిరాడు. దానిపై పాయింట్ పొజిషన్‌ (Point position)లో నిలబడిన కోహ్లి రిలే త్రో యాక్షన్ (Relay throw action)చేస్తూ కీపర్ వైపు విసిరినట్లు నటించాడు. ICC నిబంధనలలోని రూల్ (rule) 41.5 ప్రకారం, ఫీల్డింగ్ జట్టు బ్యాట్స్‌మన్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా దృష్టి మరల్చకూడదు. ఆటగాడు నిబంధనను ఉల్లంఘించినట్లు అంపైర్ భావిస్తే, అతను డెడ్ బాల్‌ను (ded ball) ప్రకటించి, ఐదు పరుగుల పెనాల్టీని ఇవ్వవచ్చు.

అయితే ఇక్కడ ఉన్న సమస్యను (problem) బంగ్లా కీపర్ అర్థం చేసుకోలేకోయాడు. నిబంధనలను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం, ‘ఫేక్ ఫీల్డింగ్’ (Fake Fielding’) బ్యాట్స్‌మెన్‌ల (batsmen)దృష్టి మరల్చినా లేదా అడ్డగించినా, దానిపై చర్య తీసుకోవచ్చు. వీడియో (video)చూస్తుంటే ఇద్దరు బ్యాట్స్‌మెన్ కోహ్లీ వైపు చూడలేదని తేలింది. అంటే కోహ్లి ఇలాంటి పని చేశాడని అతనికి కూడా తెలియదు.అటువంటి పరిస్థితిలో, నూరుల్ ఆరోపణలపై ప్రశ్నలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో అతనిపై మాత్రమే చర్య (Action) తీసుకునే అవకాశం (Chance)ఉంది. వాస్తవానికి, మ్యాచ్ సమయంలో లేదా మ్యాచ్ తర్వాత మ్యాచ్ అధికారుల నిర్ణయాలను విమర్శించే ఆటగాడిపై ICC నియమాలు చర్యలు తీసుకుంటాయి. అటువంటి పరిస్థితిలో, నిబంధనలను (Rules)తప్పుగా చూపించి, అంపైర్లను (empire)విమర్శించినందుకు వారిపై చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

(Kommineni Srinivasa Rao : ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -