end
=
Friday, November 22, 2024
వార్తలుజాతీయంజెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు...
- Advertisment -

జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు…

- Advertisment -
- Advertisment -

దేశంలోని ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ ఐఐటీ తన అధికారిక వెబ్‌సైట్‌ http://result.jeeadv.ac.in/ లో ఫలితాలను ఉంచింది. గత నెల 28, 29 తేదీల్లో జెఈఈ ఎంట్రన్స్‌ పరీక్షలు జరిగాయి. బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్‌-1కు 1,51,311 విద్యార్థులు, పేపర్‌ 2 కు 1,50,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు

ఈ పరీక్షల్లో 352/396 మార్కులు సాధించి చిరాగ్‌ ఫలోర్‌ టాపర్‌గా నిలిచాడు. అలాగే 315 మార్కులు పొందిన కనిష్క మిట్టల్‌ బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అక్టోబర్‌ 6 నుండి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రారంభించనున్నారు.

దుబ్బాక అభ్యర్థి ఎంపికలో టిఆర్‌ఎస్‌ తర్జనభర్జన

శుభాకాంక్షలు

ఈ సందర్భంగా మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంఖ్‌ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐఐటీ పరీక్షలను విజయంతంగా నిర్వహించిన ఐఐటీ ఢిల్లీని ప్రశంసించారు.

ఉద్యోగం కోల్పోయిన వారికి ESI తీపి కబురు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -