end
=
Wednesday, April 16, 2025
సినీమామైత్రీ మూవీ మేకర్స్‌కు `మ్యాస్ట్రో` స్ట్రోక్ !
- Advertisment -

మైత్రీ మూవీ మేకర్స్‌కు `మ్యాస్ట్రో` స్ట్రోక్ !

- Advertisment -
- Advertisment -

రూ.5 కోట్ల ప‌రిహారం చెల్లించండి

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కథానాయకుడి(Hero Ajith)గా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన సినిమా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. ఈ యాక్షన్ కామెడీ చిత్రం ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మ ప్రాజెక్టుగా భావిస్తూ టాలీవుడ్ కేంద్రంగా పనిచేస్తున్న మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers) సంస్థ నిర్మించింది. టీ -సిరీస్ గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్ర నిర్మాతలు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ సినిమా నిర్మాతలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaya Raja) లీగల్ నోటీసులు(Legal Notices) పంపారు. గతంలో తాను స్వరాలు సమకూర్చిన మూడు గీతాలను ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’లో అనుమతి లేకుండా రీ క్రియేట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకుగానూ రూ.5 కోట్ల పరిహారం(Compensation) ఇవ్వాలని డిమాండ్ (Demand)చేశారు. వెంటనే ఆ పాటలను తొలగించి, మేకర్స్ క్షమాపణ చెప్పాలని కోరారు. తన నోటీసులపై ఏడు రోజుల్లోగా స్పందించకపోతే లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘నట్టుపుర పట్టు’ చిత్రంలోని ‘ఓథా రూబైయుమ్ తారేయిన్’, ‘విక్రమ్’ సినిమాలోని ‘ఎన్ జోడి మంజల్ కురివి’, ‘సకల కళా వల్లవన్’ మూవీలోని ‘ఇలమై ఇధో ఇధో’ వంటి పాటలను నిర్మాతలు తాజాచిత్రం ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’లో వాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇవన్నీ ఇళయరాజా స్వరపరిచిన పాటలే. అనుమతి లేకుండా తన పాటలను వాడుకున్నందుకు ఆగ్రహించిన ఇళయరాజా.. మైత్రి నిర్మాతలకు గట్టి షాకిచ్చినట్టు తెలుస్తోంది. ఇళయరాజా నిరుడు మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలకు సైతం ఇలాగే లీగల్ నోటీసులు పంపారు. `గుడ్ బ్యాడ్ అగ్లీ` నిర్మాత‌లు ఇప్పుడు ఇళ‌య‌రాజాను ఎలా చ‌ల్ల‌బ‌రుస్తారు.. అనేది వేచి చూడాల్సిందే..

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -