end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంప్రాణాలు తీసిన అక్రమ సంబంధం
- Advertisment -

ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం

- Advertisment -
- Advertisment -

నెయ్యితో ఎన్ని లాభాలో..

వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని భర్త దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో ఆదివారం జరిగింది. నాగారం గ్రామానికి చెందిన సాల్మన్‌ రాజు (24) స్థానికంగా ఓ అపార్టుమెంటులో ప్లంబింగ్‌ పనులు చేస్తున్నాడు. అయితే ఆ అపార్టుమెంటు పక్కనే ఉన్న వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సాల్మన్‌ రాజుకు ఆ వివాహితకు వివాహేతర సంబంధానికి దారి తీసింది.

లాక్‌డౌన్‌ దిశగా యూరప్‌ దేశాలు

అయితే శనివారం రాత్రి సాల్మన్‌ రాజు ఆ మహిళతో ఒంటరిగా రాసలీలలు సాగిస్తుండడాన్ని ప్రత్యక్షంగా చూసి తట్టుకోలేని భర్త ఉమాకాంత్‌ సాల్మన్‌ రాజు తలపై రాడ్‌తో కొట్టాడు. దీంతో సాల్మన్‌రాజు అక్కడే మృతి చెందాడు. అనంతరం ఉమాకాంత్‌ పరారయ్యాడు. మృతుడు సాల్మన్‌రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్‌ పట్టణ సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పరారైన నిందితుడు ఉమాకాంత్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

కరోనా వైరస్‌తో మంత్రి మృతి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -