end
=
Wednesday, November 20, 2024
వార్తలురాష్ట్రీయంభద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
- Advertisment -

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

- Advertisment -
- Advertisment -

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రళయ గోదావరిగా మారింది. భద్రాచలం పరిధిలోని పలు గ్రామాలు, కాలనీలు ముంపు బారినపడ్డాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయ కార్యక్రమాల్లో హెలికాప్టర్లను వినియోగించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భారత సైన్యానికి చెందిన 101 మంది జవాన్లు హెలికాప్టర్లతో భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరింది. భద్రాచలం పరిధిలోని వందలాది గ్రామాలు ముంపు బారినపడ్డాయి. పిల్లా పాపలను చేతబట్టుకొని జనం ఊర్లకే ఊర్లే ఖాళీ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో సామన్లను వేసుకొని భయంభయంగా వెళ్తున్న దృశ్యాలు కదిలిస్తున్నాయి. ఇప్పటికే వరద నీటిలో మునిగిపోయిన కొంత మంది ఇళ్లపైకి చేరుకొని సాయం కోసం అర్థిస్తున్నారు. ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో భద్రాచలంలో వరదల నియంత్రణలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. భారీ వరద వస్తుందని అంచనాలున్నాయని, అందుకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని వచ్చింది వచ్చినట్లే సముద్రం వైపు వదులుతున్నట్టు తెలిపారు. దిగువన గట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలు, ఇతర సామగ్రి సిద్ధంగా ఉంచామని చెప్పారు.

1986 ఆగస్టులో భారీ వర్షాల అనంతరం వచ్చిన వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 75.6 అడుగులకు చేరింది. ఇప్పటివరకూ ఇదే రికార్డు స్థాయి వరదగా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వరద ఇలాగే కొనసాగితే శుక్రవారం రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 73 నుంచి 75 అడుగులకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -