కరోనా మహమ్మారి తెలంగాణలో తన ప్రతాపం చూపిస్తోంది. కొరలు చాచి వందలాది మంది ప్రజలను కాటువేస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఒక రోజులో సుమారు 53 వేల కరోనా టెస్టులు జరగ్గా ఏకంగా 2,579 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య లక్షా 8వేల 670కి చేరింది.
కూప్పకూలిన భవనం – శిథిలాల కింద 70 మంది
కోవిడ్ వల్ల సోమవారం 9 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. అయితే 84 వేల 163 మంది రికవరీ అవగా యాక్టీవ్ కేసులు 23,737 ఉన్నాయి. ఇందులో 17,226 మంది పాజిటివ్ వచ్చిన వారు హోం క్యారంటైన్‌లో చికిత్సపొందుతున్నారు. అయితే ఇప్పటివరకు రాష్ర్టం మొత్తం 10 లక్షల 21వేల 54 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.