end
=
Monday, January 20, 2025
క్రీడలుIND vs AUS: హైదరాబాద్‌లో మూడో టీ20!
- Advertisment -

IND vs AUS: హైదరాబాద్‌లో మూడో టీ20!

- Advertisment -
- Advertisment -

 

టి20 ప్రపంచకప్ (T20 World Cup) స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia)తో భారత్ టీ20 సిరీస్‌ ఆడనుంది.సెప్టెంబర్ 20, 23, 25వ తేదీల్లో ఆసీస్ తో భారత్ మూడు మ్యాచ్ లను ఆడనుంది. ఇక తొలి టి20 నేడు (20న) మొహాలీ వేదికగా ప్రారంభం కానున్నది. మొహాలి పిచ్ పై టీమిండియా అద్భుతమైన రికార్డు ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా టి20ల్లో భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది ఒక్కసారిగా కూడా ఓడిపోలేదు. మొహాలి పిచ్ పై ఇప్పటి వరకు 5 టి20 మ్యాచ్ లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు గెలిచింది. మరో మూడు సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు నెగ్గింది. ఈ మూడు సార్లు కూడా టీమిండియానే విజయం సాధించడం విశేషం. ఇక భారత్, ఆస్ట్రేలియా జట్లు మొహాలీ వేదికగా  టి20ల్లో కేవలం ఒకసారి మాత్రమే తలపడ్డాయి. 2016 టి20 ప్రపంచకప్ లో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ గెలిచింది.

25న హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మూడో మ్యాచ్ జరగనుంది. కరోన తర్వాత హైదరాబాద్‌లో చాలా రోజులకి మ్యాచ్ జరుగుతుండడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా అని ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం అవుతాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, యుజ్వేందర్ చాహల్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా.



ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్‌స్మిత్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, అస్గన్ అగర్, కామెరూన్ గ్రీన్, డేనియల్ శామ్స్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిష్, మాథ్యూవెడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -