end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంIndia:అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్!
- Advertisment -

India:అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్!

- Advertisment -
- Advertisment -
  • ప్రపంచంలోనే మూడో స్థానం కైవసం

భారత్ (India)రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్య(Education), వైద్యం(medical), విజ్ఞానం (Knowledge)తోపాటు టెక్నాలజీ (Technology)లోనూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే గతేడాది వాహనాల (Vehicle)అమ్మకాల్లో భారత్ మొదటిసారిగా జపాన్‌ (Japan)ను అధిగమించి మూడవ స్థానానికి ఎదిగింది. నిక్కీ ఏషియా తాజా నివేదిక ప్రకారం, 2022లో భారత్‌లో మొత్త 42.5 లక్షల కొత్త కార్లు (cars) విక్రయించబడ్డాయి. ఇది జపాన్‌లో నమోదైన 42 లక్షల కంటే ఎక్కువ. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ (Society of Indian Automobile)తయారీదారుల ప్రకారం, 2022లో జనవరి-నవంబర్ (January-November) మధ్య దేశంలో మొత్తం 41.30 లక్షల కొత్త వాహనాలు విక్రయించబడ్డాయి. దీనికి డిసెంబర్‌లో మారుతీ సుజుకి (Maruti Suzuki) విక్రయిచిన వాహనాల సంఖ్యను జోడిస్తే 42.50 లక్షలకు చేరుకుంటుంది.

అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న నాలుగో త్రైమాసిక వాణిజ్య వాహనాల అమ్మకాలు, టాటా మోటార్స్ (Tata Motors,), ఇతర వాహన తయారీ కంపెనీల అమ్మకాలను కలిపితే ఇది మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక, 2021లో 2.62 కోట్ల వాహనాల అమ్మకాలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద వాహన మార్కెట్‌గా నిలిచింది. దీని తర్వాత అమెరికా (America)1.54 కోట్లతో రెండవస్థానంలోనూ, జపాన్ 44.40 లక్షల యూనిట్లతో జపాన్ మూడవ స్థానంలో ఉండేది. దేశీయంగా 2018లో సుమారు 44 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే, 2019లో ఇది 40 లక్షలకు తగ్గింది. ఆ తర్వాత కరోనా (Covid) వల్ల 2020లో 30 లక్షలకు పడిపోగా, 2021లో తిరిగి 40 లక్షలకు పెరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెహికిల్ కంపెనీలు లాభాల బాట పడుతున్నాయి. సాధారణంగా ప్రపంచ అత్యధిక జనాభాలో రెండో స్థానంలో ఉన్న ఇండియాలోనే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి.

(Education Destruction : విద్య పేరుతో వినాశనం!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -