కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2022-23 సంవత్సరానికిగాను కేంద్ర కెబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. నిర్మలా సీతారామన్ దీంతో నాలుగు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం దక్కింది. అయితే మంత్రి సీతారామన్ ఈసారి బ్రీఫ్‌కేస్ కాకుండా డిజిటల్ రూపంలో ట్యాబ్లెట్‌లో చూసి బడ్జెట్ వివరాలు చదివి వినిపించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా, పేపర్ వాడకాన్ని తగ్గించడాన్ని ప్రోత్సహిస్తూ డిజిటల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.