- అక్టోబర్ 1- 15 వరకూ మహిళల ఆసియా కప్
- తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనున్న భారత్
- ఆరుసార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా
Women Asia Cup : భారత మహిళల (India Women) క్రికెట్ జట్టు మరో మెగా సమరానికి సిద్ధమైంది. ఇటీవల ఇంగ్లండ్‌పై (England) మూడు వన్డేల సిరీస్ క్లీన్‌స్వీప్ (Clean sweep)విజయోత్సాహంతో దూకుడుమీదున్న మహిళల క్రికెట్ జట్టు.. ఇప్పుడు బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా శనివారం (అక్టోబర్ 1) నుంచి మొదలయ్యే ఆసియాకప్‌లో (Asia Cup 2022) హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అందులో భాగంగా శనివారం తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka)తో తలపడనుంది. ఆ తర్వాత వరుసగా మలేషియా (అక్టోబర్3), యూఏఈ(అక్టోబర్ 4), పాకిస్తాన్ ( అక్టోబర్7), బంగ్లాదేశ్ (అక్టోబర్ 8), థాయ్‌లాండ్ (అక్టోబర్ 10) జట్లతో పోటిపడనుండగా.. మరోవైపు సౌత్ ఆఫ్రీకాతో పురుషుల సిరీస్ ఇటు మహిళల ఆసియా కప్ క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకానే నడుస్తుంది.
ఈ టోర్నీలో ఆతిథ్య బంగ్లాదేశ్(Bangladesh), భారత్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మలేషియా, యూఏఈలతో సహా మొత్తం 7 జట్లు (7 Teams) పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ (Round robin) ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో అన్ని జట్లు మొత్తం ఆరేసి (6 Match) మ్యాచ్‌లు ఆడనున్నాయి. లీగ్ (league)దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్ల మధ్య సెమీఫైనల్ (Semi final) మ్యాచ్ జరుగుతుంది. రెండు సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్ల మధ్య అక్టోబర్ 15న టైటిల్ (Final) పోరు జరగనుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత భారత్-శ్రీలంక మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 32 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 30 మ్యాచ్‌లు (won) గెలిచింది. ఆరుసార్లు ఆసియా ఛాంపియన్‌గా (6 times champions)నిలిచింది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఆసియా కప్‌లో భారత్ రికార్డులు ఎలా ఉన్నాయో. అయితే 2018లో జరిగిన చివరి ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది.
భారత జట్టు ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ ( Harmanpreet Kaur), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) సూపర్ ఫామ్‌లో ఉండగా జెమీమా రోడ్రిగ్స్ (jemina) చేరికతో బ్యాటింగ్ (batting) లైనప్ మరింత పటిష్ఠంగా మారింది. అవసరమైతే హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా మెరుగ్గానే రాణిస్తున్నారు. అయితే షెఫాలీ వైఫల్యం జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. ఇక బౌలింగ్ (bowling) లో రేణుకా సింగ్ ఠాకూర్ తన స్వింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. మరో పేసర్ పూజా వస్త్రకర్ కూడా నిలకడగా రాణిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా స్పిన్ విభాగంలో రాణిస్తున్నారు. వీరందరూ సమష్ఠిగా రాణిస్తే మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలుస్తుంది.
(Cricket: టీమిండియా సారథి రోహిత్ శర్మ)