end

T20 Ranks :ఇండియానే నంబర్ 1

  • 2022 టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ‘ఐసీసీ’
  • 268 పాయింట్లతో మొదటి స్థానంలోకి భారత్
  • 261తో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్

T20 Ranks : భారత్ – ఆస్ట్రేలియా(Bharat-Australia) మధ్య జరిగిన మూడో టీ 20లో గెలిచిన ఇండియా టీమ్.. సిరీస్ మాత్రమే కాదు ఐసీసీ ర్యాకింగ్స్‌లోనూ దూసుకెళ్లింది. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం హైదరాబాద్‌(Hyderabad)లో  జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో గెలిచి 268 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 261 పాయింట్లతో ఇంగ్లాండ్(England) రెండో స్థానంలో నిలిచింది. ఇక 258 పాయింట్లతో పాకిస్తాన్ మూడో స్థానంలో సౌతాఫ్రికాతో సమంగా ఉండగా 252 పాయింట్లతో న్యూజిలాండ్(New Zealand) ఐదో స్థానంలో కొనసాగుతోంది.

(T20 World Cup: బౌలర్లు.. అతడితో జాగ్రత్త)

రోహిత్ శర్మ(Rohith Sharma) కెప్టెన్సీ(Captaincy)లో భారత్ ఆసియాకప్ మినహా మిగతా సిరీస్ అన్నింటిలో గెలిచింది. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 టీం ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంకింగ్ పాయింట్లు పెరిగాయి. దీంతో నంబర్ 1 ర్యాంకు మరింత పదిలమైంది. ఇకపోతే ర్యాంకింగ్స్‌లో(Rankings) ఆరో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. భారత్‌తో సిరీస్ ఓడిపోయిన తర్వాత ఒక పాయింట్‌ను కోల్పోయిన్నప్పటికీ సేమ్ ర్యాంకులో ఉంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం పాకిస్థాన్‌(Pakistan)లో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను(T20 Series) ఆడుతోంది. ప్రస్తుతం సిరీస్ 2-2తో సమంగా ఉండగా సీరస్ ముగిసేవరకూ ర్యాంకుల్లో తేడాలొచ్చే అవకాశం ఉంది. 7వ స్థానంలో వెస్టిండీస్, 8వ స్థానంలో శ్రీలంక, 9వ స్థానంలో బంగ్లాదేశ్, 10వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.

(chloecherry: 18 ఏళ్లకే కంట్రోల్ తప్పా…)

అలాగే సెప్టెంబర్ 28నుంచి దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఆడబోతుండగా.. భారత్ ఈ సిరీస్ విజయాన్ని పూర్తి చేయగలిగితే.. నంబర్ 1 ర్యాంకు టీ20 జట్టుగా ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ 2022లోకి భారత్ అడుగుపెడుతుంది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ(Virat Kohli) హాఫ్ సెంచరీలతో చెలరేగిన నేపథ్యంలో భారత్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపొందింది. సిరీస్ ప్రారంభంలో 0-1తో భారత్ వెనకబడింది. అయితే చివరి రెండు గేమ్‌లలో భారత్ బలంగా పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ నాకు చాలా ప్రత్యేక స్థానం. టీమిండియా తరఫున అలాగే డెక్కన్ ఛార్జర్స్‌ తరఫున చాలా జ్ఞాపకాలను ఇక్కడ కలిగి ఉన్నాం. ఇది చాలా గొప్ప సందర్భం. మేము భారీ ప్రదర్శన ఇవ్వాలనుకున్నాం. మేము అనుకున్నట్లే సరిగ్గా అమలు చేశాం. ‘ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ యంగ్ బ్యాట్స్‌మ్యాన్ సూర్యపై తనదైన స్టైల్‌లో ప్రశంసలు కురిపించాడు. 

Exit mobile version