end

ఆసీస్‌ పర్యటనకు భారతజట్టు.. రోహిత్ దూరం

సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో వైస్‌ కెప్టెన్‌ అయిన రోహిత్ శర్మ లేకుండానే జట్టు ఆస్ట్రేలియా బయలుదేరనుంది. ఐపీఎల్‌లో తొడ కండరాల గాయంతో ఇటీవలి మ్యాచ్‌లకు దూరమైన రోహిత్‌.. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని సెలెక్టర్లు తెలిపారు. బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై జట్టును ప్రకటించింది. కాగా, ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న హైదరబాది పేసర్‌ సిరాజ్‌ టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ 20 జట్టుకు ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్స్‌లో విరాట్ కోహ్లి కెప్టెన్‌గా కొనసాగనుండగా, టీ 20, వన్డే ఫార్మాట్స్‌కు కె ఎల్ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టెస్టులకు రహానే వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడు. వచ్చే నెలలో మొదలవనున్న పర్యటనలో భాగంగా కంగారూ గడ్డపై టీమిండియా మూడేసి టీ20లు, వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది.

టీ20 జట్టుః విరాట్ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, కె ఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్ధిక్‌ పాండ్యా, సంజూ శాంసన్‌, జడేజా, సుందర్‌, చాహల్‌, బుమ్రా, షమీ, నవదీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి.

వన్డే జట్టుః విరాట్ కోహ్లి(కెప్టెన్‌), ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కె ఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, మయాంక్‌ అగర్వాల్‌, జడేజా, చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌.

టెస్టు జట్టుః విరాట్ కోహ్లి(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, కె ఎల్‌ రాహుల్‌, పుజారా, రహానే(వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారీ, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా, రిషభ్‌ పంత్‌, బుమ్రా, షమి, ఉమేష్‌ యాదవ్‌, సైనీ, కుల్‌దీప్‌ యాదవ్‌, జడేజా, అశ్విన్‌, సిరాజ్‌.

Exit mobile version