end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంసెప్టెంబర్‌ 7 నుండి అన్‌లాక్‌ 4.0
- Advertisment -

సెప్టెంబర్‌ 7 నుండి అన్‌లాక్‌ 4.0

- Advertisment -
- Advertisment -
  • దశలవారిగా మెట్రోరైళ్లకు అనుమతి
  • నిబంధనలు, మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను సవరిస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటిలో పలు రంగాలకు సంబంధించి ఆంక్షల నుంచి సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు ప్రయాణ సౌకర్యార్థం ముందుగా మెట్రో రైలును అనుమతించింది. సెప్టెంబర్‌ 7 నుండి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. అయితే సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలలు, షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌ తెరవడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఇదిలావుండగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా మరికొంత కాలం నిషేధం విధిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.

(కరీంనగర్‌ విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం)

అన్‌లాక్‌ 4.0 పూర్తి వివరాలు…

  • సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
  • సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌
  • 100 మందికి మించకుండా స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజకీయ సమావేశాలకు అనుమతి
  • సభలు నిర్వహించే సమయంలో భౌతికదూరం, మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరి
  • సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి
  • అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగింపు
  • అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
  • చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం
  • సెప్టెంబర్‌ 30 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -