అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు,స్విమ్మింగ్ పూల్స్‌కు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మూతపడ్డ సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తిరిగి తెరిచేందుకు అవకాశం కల్పించారు.
జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు
కొత్త నిబంధనల ప్రకారం 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు విద్యాసంస్థలపై విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదించాక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.విద్యాసంస్థలు తెరిచే విషయంలో రాష్ట్రాలు సొంత మార్గదర్శకాలు రూపొందించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభం
కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని ఉన్నత విభాగాలకు విడిచి పెట్టింది. ఆన్‌లైన్ తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అలాగే, 15 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు తెరిచేందుకు అనుమతినిచ్చింది. స్టేడియంల్లో క్రీడాకారుల శిక్షణ పొందేందుకు వెసులుబాటు కల్పించారు. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది.
ఏపీలో ప్రత్యేక రైల్వే సర్వీసులు
విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, ధార్మిక, రాజకీయ సభలు సమావేశాలకు 100 మంది వరకు ఇప్పటికే అనుమతి ఉండగా, 100 మందికి మించి అనుమతించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది కేంద్రం. అటు అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చసింది కేంద్రం.