end
=
Monday, January 20, 2025
క్రీడలుINDIA:అలవోకగా గెలిచిన భారత్..
- Advertisment -

INDIA:అలవోకగా గెలిచిన భారత్..

- Advertisment -
- Advertisment -

దక్షిణాఫ్రికా‌పై 8 వికేట్ల తేడాతో ఘనవిజయం

  • మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ముందంజ


మాస్టర్ కార్డ్ (Master card) సిరీస్‌లో భాగంగా భారత్- సౌత్‌ఆఫ్రికా (IND vs SA)మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ (Match)లో ఇండియా అలవోకగా విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 8 వికెట్ల నష్టానికి 106 పరుగులకే (runs) పరిమితమైంది. కాగా 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది భారత్. ఇండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ (Top Order) బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమవగా మూడు ఓవర్లు పూర్తికాకుండానే ఐదు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టు ఒక దశలో 50 రన్స్ కూడా చేయడ కష్టంగానే కనిపించగా టెయిలెండర్ల సాయంతో ఎట్టకేలకు వంద మార్క్‌నుదాటింది.

ఈ మ్యాచ్‌లో అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్ బౌలింగ్‌లో అదరగొట్టగా.. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ 1,0,0,0 స్కోర్స్‌తో పెవిలియన్ బాటపట్టారు. కేవలం ఒక ఓవర్ లోనే అర్ష్‌దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ఒక వికెట్ మూడో ఓవర్‌లో మరో వికెట్ తీసుకున్నాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ 1, కెప్టెన్ బవుమా 0, రిలీ రోసౌ 0, డేవిడ్ మిల్లర్ 0, స్టబ్స్ 0 ఇలా వరుస‌పెట్టి అవుటవ్వడంతో దక్షిణాఫ్రికా పవర్ ప్లే పూర్తికాకుండానే పీకలోతు కష్టాలో పడింది. చివర్లో కేశవ్ మహారాజ్, పార్నెల్ కాస్త ఆచితూచి ఆడటంతో గౌరవ పదమైన స్కోర్ చేయగలిగింది.

(Ram Charan:క్రికెటర్లకు విందు ఇచ్చిన మెగా హీరో..)

అయితే యంగ్ బౌలర్ అర్ష్‌దీప్‌పై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ తాను వేసిన మొదటి ఒవర్లోనే మూడు వికెట్లు అందించాడు. దక్షిణాఫ్రికాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికి అర్షదీప్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేక వికేట్లు పారేసుకున్నారు. ఈ క్రమంలో 9 పరుగులకే ఐదు వికెట్లు పడటంతో ఆతర్వాత వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ మార్కరామ్ (markaram) 24 బంతులో 3ఫోర్లు 1సిక్స్‌తో 25, మహారాజ్ (maharaj) 35 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 41, పార్నెల్ (Parnell) 37 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్‌తో 24 పరుగులు చేసి ఇండియా ముందు 107 పరుగులు లక్ష్యాన్ని ఉంచారు.

ఇక 107 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే విజయం సాధించగా.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ముందజంలో నిలిచింది. కేఎల్ రాహుల్ 51(56 బంతులు, 2 ఫోర్లు, 4 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ 50(33 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అయితే ఛేజింగ్‌కు దిగిన టీమిండియాను తొలి దెబ్బ తీసిన రబాడ.. ఖాతా తెరవకుండానే కెప్టెన్ రోహిత్ శర్మను ఔటచేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి 9 బంతుల్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ భారత బౌలర్లలో హర్షల్ పటేల్, దీపక్ చాహర్ తలో 2 వికెట్లు తీయగా అక్షర్ పటేల్‌కు1 వికేట్ దక్కింది. చివరగా 4ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికేట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్‌‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

(T20 Ranks :ఇండియానే నంబర్ 1)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -