భారతదేశ మిలిటరీ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న సైనిక ఉద్యోగి భారతదేశ రక్షణ విభాగానికి చెందిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌కు చేరవేస్తూ దేశద్రోహానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సైనిక నిఘా వర్గాలు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ సిఎం జగన్‌కు వణుకు పుడుతోంది
వివరాల్లోకి వెళితే హర్యానాలోని రేవారి జిల్లాకు చెందిన యువకుడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో భారత సైనిక ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. అయితే ఇతను మిలటరీ ఉద్యోగి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నాడు.
మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
అతనిపై అనుమానం రావడంతో సైనికాఅధికారులు అతనిపై నిఘా పెంచారు. అనంతరం అతనిపై దర్యాప్తు చేపట్టారు. హర్యానా టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురుగ్రామ్‌లోని దారుహెరా బస్టాండులో అతని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై దేశద్రోహ చట్టం, ఇంకా వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేసి అతను ఏయే వివరాలు పాకిస్తాన్ మిలిటరీకి చేరవేశాడో విచారిస్తున్నారు.