- జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలలో భారత సైన్యం సోదాలు
భారతసైన్యం జమ్మూకశ్మిర్‌లోని బారముల్లా జిల్లాలో భారీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో ఉగ్రవాదులు దాచి ఉంచిన ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. సోమవారం నుండి మంగళవారం ఉదయం 5 గంటల వరకు భారత సైనికులు బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్ సెక్టార్‌లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
కరోనా వైరస్‌ను నియంత్రించాకే వ్యాపారాలు
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి
అయితే ఈ తనిఖీల్లో ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులు దాచిపెట్టిన మారణాయుధాలు ఏకే సిరీస్ రైఫిళ్లు, పిస్టళ్లు, తొమ్మిది మేగజైన్లు, 21 గ్రెనేడ్లు, యాంటెన్నాతో కూడిన రేడియో సెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో భారత సైన్యం దాడులు చేయాలనే ఆలోచనతో ఉగ్రవాదులు ఆయుధాలు దాచిఉంచినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సోదాలలో భారీగానే ఆయుధాలు బయటపడ్డాయి.
పీఎం మోడి ప్రణబ్ ముఖర్జీకి నివాళ్లు