- ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచిన ప్రణబ్
భారతదేశం మాజీ రాష్ర్టపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ (84) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అయితే కరోనాతో పాటు ఆయన మెదడులో బ్లడ్ క్లాట్ అయిందని, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా మరణ వార్తను ధృవీకరించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు.
ఆరోగ్యంగా కేంద్ర మంత్రి అమిత్‌షా
ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(హిస్టరీ), ఎంఏ(పొలిటికల్ సైన్స్), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా కూడా పనిచేసిన ప్రణబ్ తర్వాత రాజకీయాల్లోకి చేరి ఎన్నో శిఖరాగ్రాలను అధిరోహించారు.
Paytm డేటా సర్వర్లపై హ్యాకర్లు దాడి
కరోనాతో పాటు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కూడా రావడంతో ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత కాలం కోమాలో కొనసాగిన ఆయన చివరికి ఇవాళ ప్రాణాలొదిలారు. ప్రణబ్ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా తమ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు.
ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
రాజకీయ జీవితం
- 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక
- 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక
- 1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత
- 1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా
- 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా…
- 1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా..
- 1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా..
- 1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా..
- 1982-84లో ఆర్థికమంత్రిగా..
- 1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా..
- 1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా..
- 1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు
- జంగీపూర్ నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నిక
- 2004-06లో రక్షణశాఖ మంత్రిగా..
- 2006-09లో విదేశాంగమంత్రిగా..
- 2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు
- 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.