end

Indian Judiciary & Indian Polity:భారత న్యాయవ్యవస్థ & ఇండియన్ పాలిటీ


పోటీ పరిక్షలక సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం భారత న్యాయవ్యవస్థ, ఇండియన్ పాలిటీ సుప్రీంకోర్టు నిర్మాణం న్యాయమూర్తుల నియామకం, జీతభత్యాలకు సబంధించిన వివరాలు.

భారత న్యాయవ్యవస్థ: Indian Judiciary:
ఇండియన్ పాలిటీ Indian Polity

బ్రిటీష్ కాలంలో (British period) న్యాయవ్యవస్థ:
బ్రిటీష్ కు ముందు దివ్య పరీక్షలు అమల్లో ఉండేవి.
బ్రిటీష్ వారు దివ్య పరీక్షలను రద్దు చేసి అద్భుతమైన న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టారు.

వారన్ హేస్టింగ్స్: Warren Hastings
ఈ కాలంలో రెండు రకాల న్యాయవ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి.

  1. సదర్ దివాని అదాలత్ (ఉన్నత సివిల్ కోర్టు)
  2. సదర్ నిజామత్ అదాలత్ (ఉన్నత క్రిమినల్ కోర్టు)

1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడింది.
ఈ కోర్టు ఇచ్చిన తీర్పును బ్రిటన్ లోని ప్రీవీ కౌన్సిల్ కు అప్పీల్ చేసుకోవచ్చు.

కారన్ వాలీస్: Caron Wallis
సంచార న్యాయస్థానాలు (Mobile Court)ని ఏర్పాటు చేశాడు.
ఇండియాలో తొలి సంచార న్యాయస్థానం హర్యానాలో ఏర్పాటు చేశారు.
తొలిసారి న్యాయవ్యవస్థను ప్రారంభించినది – వారన్ హేస్టింగ్స్
న్యాయవ్యవస్థను అభివృద్ధి చేసిన పితామహుడు- కారన్ వాలీస్

విలియం బెంటిక్: William Bentick
విలియం బెంటిక్ కాలంలో లా కమిషన్ ఏర్పాటు చేయబడింది.
మొదటి లా కమిషన్ చైర్మన్ – లార్డ్ మెకాలె

భారత న్యాయవ్యవస్థ: Indian Judiciary
న్యాయశాఖ నిర్మాణం బ్రిటన్ నుంచి పనివిధానం అమెరికా నుండి గ్రహించారు.
భారతదేశంలో న్యాయశాఖ విభజన లేదు. అంతిమ కోర్టు సుప్రీంకోర్టు
అనగా భారతదేశ న్యాయవ్యవస్థ ఏకీకృత న్యాయవ్యవస్థ

న్యాయ శాఖ పనివిధానం:
భారత దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంది. అనగా న్యాయసమీక్ష అధికారం ఉంది.
న్యాయ సమీక్ష అధికారం రాజ్యాంగానికి లోబడి ఉండాలి.
అనగా దేశంలో అత్యున్నత శాసనం – భారత రాజ్యాంగం అని అర్థం.
రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది.

సుప్రీంకోర్టు నిర్మాణం: Structure of the Supreme Court
ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీం కోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తితోపాటు పార్లమెంట్ నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
పార్లమెంట్ న్యాయమూర్తుల సంఖ్యను చట్టం చేసి నిర్ణయిస్తుంది.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను పార్లమెంటు, హైకోర్టు లో న్యాయమూర్తులను రాష్ర్టపతి నిర్ణయిస్తారు.

న్యాయమూర్తుల నియామకం: Appointment of Judges
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ర్టపతి నియామకం చేస్తారు.
కొలీజియం సూచించిన పేరును కేంద్ర కేబినెట్ కి పంపుతారు.
కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ర్టపతికి పంపుతుంది
కేంద్ర కేబినెట్ తిరస్కరిస్తే కొలీజియంకు వెనక్కి పంపుతుంది.
వెనక్కిపంపిన పేరును కొలీజియం రెండో సారి ఆమోదిస్తే క్యాబెనెట్ తప్పని సరిగా ఆమోదించాలి.
నియామకం విషయంలో పార్లమెంట్ కంటే కొలీజియం వ్యవస్థకే ఎక్కువ అధికారాలున్నాయి.

ప్రమాణ స్వీకారం:
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ర్టపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
హైకోర్టు న్యాయమూర్తులను గవర్నర్ ప్రమాణ స్వీకారం(Oath Taking) చేయిస్తారు.

పదవికాలం:
న్యాయమూర్తులకు పదవికాలం కాకుండా పదవి విరమణ వయసు పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు – 65 ఏళ్లు
హైకోర్టు న్యాయమూర్తులకు – 62 ఏళ్లు.
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు రాష్ర్టపతికే రాజీనామా ఇవ్వాలి.

ప్రధాన న్యాయమూర్తి నియామకం:
సాధారణంగా లేదా సాంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ర్టపతి నియమిస్తారు.

తొలగింపు:
అసమర్థత, దుష్ట ప్రవర్తన లేదా అవినీతి వంటి కారణాలచేత అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు.
ఈ తీర్మానానికి 100 మంది లోక్ సభ సభ్యుల మద్ధతు కావాలి. 50 మంది రాజ్యసభ సభ్యుల మద్ధతు అవసరం.

అభిశంసన తీర్మానం:
న్యాయమూర్తుల తొలగింపు తీర్మానం పేరు – అభిశంసన తీర్మానం అంటారు.

కారణాలు:
అసమర్దత
దుష్ట ప్రవర్తన
పై రెండు కారణాలతో ఎంపీలు ఏ సభలో అయినా అభిశంసన తీర్మానం సభాపతి అనుమతితో ప్రవేశపెట్టవచ్చు.
లోక్‌సభలో అయితే 100 మంది సంతకాలతో స్పీకర్ కి..రాజ్యసభలో అయితే 50 మంది సంతకాలతో ఛైర్మన్ కి ఇవ్వాలి.
తనకు నచ్చిన తీర్మానంను సభాపతి తిరస్కరించవచ్చు లేదా రద్దు అవుతుంది.
లేదా దానిని ఆమోదించవచ్చు.
తీర్మానంను సభాపతి ఆమోదించి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తాడు.

విచారణ కమిటీలో సభ్యులు:

  1. సుప్రీంకోర్టు ప్రధాన న్యయమూర్తి /సీనియర్ న్యాయమూర్తి
    2.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి /సీనియర్ న్యాయమూర్తి
  2. న్యాయనిపుణుడు
    విచారణ కమిటీ ఆరోపణలు అవాస్తవం అని చెబితే తీర్మాణం రద్దవుతుంది.
    వాస్తవం అని చెబితే సభలో చర్చకు వచ్చి ఓటింగ్ జరుగుతుంది.
    సభకు హాజరైన సభ్యుల్లో 2/3వ వంతు ఆమోదిస్తే 2వ సభకు వెలుతుంది.
    2వ సభ కూడా 2/3వ వంతుతో ఆమోదిస్తే రాష్ర్టపతి లాంచనంగా తొలగిస్తాడు.

జీత భత్యాలు:
ప్రధాన, ఇతర న్యాయమూర్తుల వేతనాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం: రూ. 2,80,000
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం రూ. 250000
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం: 2,50,000
హైకోర్టు న్యాయమూర్తి వేతనం రూ. 2,25000
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు భారత సంఘటిత నిధి నుండి ఇస్తారు.
హైకోర్టు న్యాయమూర్తులకు జీతాలు రాష్ర్ట సంఘటిత నిధి నుండి ఇస్తారు.
పదవి విరమణ అనంతరం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

Exit mobile version