end
=
Friday, November 22, 2024
విద్యా సమాచారంIndian Polity:ఇండియన్ పాలిటీ
- Advertisment -

Indian Polity:ఇండియన్ పాలిటీ

- Advertisment -
- Advertisment -

Study material: రాష్ట్ర శాసనశాఖ గురించి 168-212 వరకు గల నిబంధనలు పేర్కొంటున్నావి
ఇది రాజ్యాంగంలోని 6వ భాగంలో ఉంది.  
168వ నిబంధన ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర శాసనశాఖ ఉంటుంది.
రాష్ట్ర శాసనశాఖ అనగా విధాన పరిషత్, విధాన సభ మరియు గవర్నర్ అని అర్థం.  

రాష్ట్ర శాసనశాఖలో గవర్నర్ అంతర్భాగం.
ఎగువ సభ – విధాన పరిషత్
దిగువ సభ – విధాన సభగా పిలుస్తారు.
రాజ్యాంగం ప్రకారం శాసనశాఖలో సభ్యత్వం లేకుండా సమావేశాలకు హాజరయ్యే ఏకైక వ్యక్తి – అడ్వకేట్ జనరల్
అడ్వకేట్ జనరల్ శాసనశాఖలో బిల్లుపై జరిగే ఓటింగ్ లో పాల్గొనకూడదు. సభలో జరిగే చర్చలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఆర్థిక విషయాల్లో విధానసభకు ఎక్కువ అధికారాలు, విధాన పరిషత్ కు తక్కువ అధికారాలు ఉంటాయి.
విధాన పరిషత్ ను విధాన మండలిగా, విధాన సభను శాసన సభగా పిలుస్తారు.

(Legislature/ Constituent Assembly:శాసనసభ/ విధాన సభ)

ప్రతిపక్ష నాయకుడు:
ప్రతిపక్ష నాయకులకు రాష్ట్ర కేబినెట్ మంత్రితో సమానమైన హోదా, గౌరవం ఉంటుంది.
ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందడానికి కనీసం 1/10వ వంతు సభ్యుల మద్దతు ఉండాలి.
శాసనసభ సమావేశం జరగడానికి కనీసం 1/10వ వంతు సభ్యులు హాజరుకావాలి.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనశాఖ సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాలి.
2 సమావేశాల మధ్య కాలవ్యవధి – 6 నెలలు ఉండాలి.
సాధారణంగా రాష్ట్ర శాసనశాఖ సంవత్సరానికి 3 సార్లు సమావేశమవుతుంది.
అవి:
1) బడ్జెట్ సమావేశాలు (Budget Session)
2) వర్షాకాల సమావేశాలు (Monsoon Session)
3) శీతాకాల సమావేశాలు (Winter Session)
రాజ్యాంగం ప్రకారం శాసనసభా సమావేశాలకు గరిష్ట సంఖ్య లేదు.
సంవత్సరానికి ఎన్నిసార్లు అయినా శాసనసభా సమావేశాలు జరగవచ్చును.
ఎక్కువ రోజులు శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
తక్కువ రోజులు వర్షాకాలం సమావేశాలు జరుగుతాయి.

(General Knowledge:జనరల్ నాలెడ్జ్)

విధాన పరిషత్/విధాన మండలి:
విధాన పరిషత్ గూర్చి వివరించే నిబంధన – 171
169వ నిబంధన ప్రకారం పార్లమెంట్ సాధారణ మెజార్టీతో విధాన పరిషత్ ను ఏర్పాటు లేదా రద్దు చేస్తుంది.
 రాష్ట్ర శాసనసభ 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించి సిపారసు చేసినట్లయితే పార్లమెంట్ సాధారణ మెజార్టీతో
ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానము అమలులో ఉంది.
(1) ఉత్తరప్రదేశ్ – 100  (2) మహారాష్ట్ర – 78  (3) బీహార్ – 75  (4) కర్ణాటక – 75  (5) ఆంధ్రప్రదేశ్ – 58  (6) తెలంగాణ – 40
అతి త్వరలో విధాన పరిషత్ రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్నాయి.
రాజ్యాంగ ప్రకారం విధాన పరిషత్ కనీస సభ్యుల సంఖ్య – 40 మంది
రాజ్యాంగ ప్రకారం విధాన పరిషత్ గరిష్ఠ సభ్యుల సంఖ్య శాసనసభా సభ్యుల మొత్తంలో 1/3వ వంతుకు మించి వుండకూడదు.
171వ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ 1/6 వ వంతు సభ్యులను విధానపరిషత్ కు నియమిస్తారు.
కలలు, సాహిత్యం , సమాజ సేవ, శాస్త్ర సాంకేతిక మరియు ఇతర రంగాల్లో అనుభవం గలవారిని గవర్నర్ నామినేట్ చేస్తారు.

అర్హతలు
భారతీయ పౌరుడైవుండాలి.
కనీస వయస్సు 30 సంవత్సరాలు నిండివుండాలి.
లాభాదాయకమైన పదవి ఉండరాదు.
ఎస్సీ, ఎస్టీలు 5,000: ఇతరులు 10,000 రూ.లను డిపాజిట్ చేయాలి.

ఎన్నిక విధానము
విధాన పరిషత్ ఎన్నికలను నిర్వహించేది – భారత ఎన్నికల సంఘం.
విధాన పరిషత్ సభ్యులను ఈ క్రింది వారు ఎన్నుకుంటారు. —
శాసనసభ సభ్యులు 1/3వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
స్థానిక సంస్థలు 1/3వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
ఉపాధ్యాయులు 1/12వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
పట్టభద్రులు 1/12వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ 1/6వ వంతు సభ్యులను నియమిస్తారు. (కళలు, సాహిత్యం , సామాజిక సేవ, శాస్త్రసాంకేతిక మరియు ఇతర రంగాల్లో అనుభవం గలవారు)
విధాన పరిషత్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది – చైర్మన్.
విధాన పరిషత్ శాశ్వతమైనది కాదు.
పార్లమెంట్ సాధారణ మెజార్టీతో విధాన పరిషత్ ను రద్దు చేస్తుంది.

పదవీ కాలం
విధాన పరిషత్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. 
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
కొత్తగా విధానపరిషత్ ఏర్పడినప్పుడు 2 సంవత్సరాలకు లాటరీ పద్ధతి ద్వారా 1/3వ వంతు సభ్యులను నిర్ణయిస్తారు. 
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సమక్షంలో లాటరీ పద్ధతిని నిర్వహిస్తారు.
పదవి విరమణ చేసిన వారు తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలవవచ్చు
విధానపరిషత్ సభ్యులు తమ రాజీనామా లేఖను చైర్మన్ కు ఇవ్వాలి. 
ఏ కారణం చేతనైనా సభ్యుని పదవి ఖాళీ అయితే 6 నెలలలోపు భర్తీ చేయాలి.
విధాన పరిషత్ ఎన్నికలో నైష్పత్రిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది
విధాన పరిషత్ సభ్యుల యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం చైర్మన్ కు ఉంటుంది.

Chairman  చైర్మన్ :
విధాన పరిషత్ కు అధిపతి – చైర్మన్
విధాన పరిషత్ చైర్మన్ కు రాష్ట్ర కేబినెట్ మంత్రి కంటే ఎక్కువ సదా, గౌరవం ఉంటుంది.
సాధారణంగా చైర్మన్ అధికార పార్టీకి, డిప్యూటీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి చెందివుంటారు.
రాజ్యాంగ ప్రకారం విధానపరిషత్ సభ్యులు తమలో ఒకరిని చైర్మన్ గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు వర్తించకుండా ఉండటానికి పదవిని చేపట్టిన వెంటనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
విధాన పరిషత్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించేది ప్రొటెం చైర్మన్ / తాత్కాలిక చైర్మన్.
ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ తాత్కాలిక చైర్మన్/ ప్రొటెం చైర్మన్ ను నియమిస్తారు.
ప్రొటెం చైర్మన్ కు 2 అధికారాలు ఉంటాయి. 1. తొలి సమావేశానికి అధ్యక్షత వహించి హాజరైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం.2. చైర్మన్ ఎన్నికను నిర్వహించడం.

ఎన్నిక విధానం
విధాన పరిషత్ చైర్మన్ ఎన్నికను నిర్వహించేది – ప్రోటెం చైర్మన్
విధాన పరిషత్ సభ్యులు తమలో ఒకరిని చైర్మన్ గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు.
రాజ్యాంగ ప్రకారం చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు ప్రమాణ స్వీకారం ఉండదు.
సాంప్రదాయకంగా విధాన పరిషత్ లో గల అధికార పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు గౌరవంగా చైర్మన్, డిప్యూటీచైర్మన్లను పదవి వద్దకు తీసుకువస్తారు.

పదవీ కాలం:
చైర్మన్ పదవీ కాలం – 6 సంవత్సరాలు.
చైర్మన్ తన రాజీనామా లేఖను డిప్యూటీ చైర్మన్ కు ఇవ్వాలి.
ఏ కారణం చేతనైనా చైర్మన్ పదవి ఖాళీ అయితే 6 నెలల లోపు భర్తీ చేయాలి.
చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు డిప్యూటీ చైర్మన్ 6 నెలలకు మించకుండా తాత్కాలిక చైర్మన్ గా విధులను నిర్వహిస్తారు.
అధికార దుర్వినియోగం అవినీతికి పాల్పడినప్పుడు చైర్మన్ కు వ్యతిరేఖంగా 14 రోజుల ముందస్తు నోటీసుతో అవిశ్వాస తీర్మాణాన్ని విధాన పరిషత్ లో ప్రవేశపెట్టవచ్చును.
అవిశ్వాస తీర్మాణం పైన ఓటింగ్ జరిగే రోజు నాడు చైర్మన్ అధ్యక్ష స్థానంలో ఉండకూడదు.
అవిశ్వాస తీర్మాణంపై జరిగే ఓటింగ్ లో చైర్మన్ పాల్గొనవచ్చును
విధాన పరిషత్ అవిశ్వాస తీర్మాణాన్ని 2/3వ వంతు మెజార్టీతో ఆమోడించినట్లయితే చైర్మన్ పదవి నుండి తొలగించబడతారు.

(Seedat:లక్ష రూపాయల జీతంతో ఇంజనీర్ పోస్టులు)

(Powers and Functions) అధికారాలు – విధులు
విధాన పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించి ప్రశాంతంగా నిర్వహించాలి.
విధాన పరిషత్ లో సభ్యులకు సీట్లను కేటాయించడం, గ్రంథాలయ వసతిని కల్పిస్తారు.
విధాన పరిషత్ నిర్ణయాలను అధికారికంగా ప్రకటిస్తారు.
విధాన పరిషత్ నియమాలను ఉల్లంఘించిన సభ్యులను సస్పెండ్ చేస్తారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుల యొక్క సభా సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.
ఏ సభ్యుడయినా చైర్మన్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సమావేశానికి హాజరుకానట్లయితే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.
విధాన పరిషత్ లో బిల్లుపై జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా, వ్యతిరేంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు చైర్మన్ ఓటింగ్ లో పాల్గొంటారు.
చైర్మన్ ఓటును నిర్ణయకపు ఓటు అంటారు.
విధాన పరిషత్ లో జరిగే చర్చలను రికార్డు చేసి భద్రపరుస్తారు.
విధాన పరిషత్ లో పనిచేసే సిబ్బందిని నియంత్రణ చేస్తారు.
విధాన పరిషత్ ఆమోదించిన తీర్మానం పైన చైర్మన్ సంతకం చేసి విధాన సభకు పంపుతారు.
సభ్యులు ప్రవేశపెట్టే బిల్లును సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లుగా నిర్ణయిస్తారు.
సభ్యులు అడిగే ప్రశ్నలను నక్షత్రపు గుర్తు గల ప్రశ్నలుగా, నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలుగా నిర్ణయిస్తారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -