end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Internet: ఇంటర్నెట్ వినియోగంలో భారత మహిళలు వెనుకంజ..
- Advertisment -

Internet: ఇంటర్నెట్ వినియోగంలో భారత మహిళలు వెనుకంజ..

- Advertisment -
- Advertisment -

  • డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నవారు 22.2% మాత్రమే
  • దేశవ్యాప్తంగా చేపట్టిన పలు సర్వేల్లో ఫలితాల వెల్లడి
  • ఈ కారణంగా విస్త్రృత ఉపాధి అవకాశాలకు దూరం


కొవిడ్-19 (Covid) మహమ్మారి ఇన్‌ఫర్మేషన్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ (Information, health care, education) సహా ఇ-కామర్స్ (E-commerce), ఆర్థిక సేవలు, ఆదాయ – ఉత్పత్తి అవకాశాల కోసం మొబైల్ (Mobile), మొబైల్ ఇంటర్నెట్‌కు (internet) యాక్సెస్ (Access) పట్ల ప్రాముఖ్యతను బలోపేతం చేసింది. కానీ మొబైల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ (Gender gap report)2022 ప్రకారం.. పాండమిక్ సైతం ‘డిజిటల్ డివైడ్‌ (Digital device)తీవ్రతను హైలైట్ చేసింది’. ఈ మేరకు మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్ లేని వారు ‘మరింత వెనుకబడిపోయే ప్రమాదముంది. భారతదేశంలో (india) సగానికి పైగా మహిళలు (womens)(53.9%) మొబైల్ ఫోన్స్ కలిగి ఉన్నప్పటికీ వీరిలో 22.5% మాత్రమే ఆర్థిక లావాదేవీల కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ గణాంకాలే ఇంటర్నెట్ వినియోగంలో జెండర్ గ్యాప్‌ను సూచిస్తున్నాయి. ఇంతకీ ఈ పరిస్థితులకు దారితీస్తున్న కారణాలేంటి? ఈ విషయంలో లింగ అసమానతలను ఏవిధంగా సరిచేయొచ్చు?

12 ఏళ్లు (Years) పైబడిన విద్యార్హత (Sudy) కలిగిన మహిళల్లో 72%కి పైగా ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో V తరగతి (5 Class)వరకు చదివిన స్త్రీలలో 8% మాత్రమే ఉన్నారు. పెద్దవారి కంటే, అత్యధిక సంపద కలిగిన వారి కంటే యువతులు (youth) ఎక్కువగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (National Family Health Survey) కనుగొంది. ఈ లెక్కన భారతీయ మహిళల్లో మూడోవంతు మంది మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్లు తేలింది.

అవకాశాలకు దూరమయ్యారు :


ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(Asian Development Bank), సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ (social networking platform LinkedIn) 2022 నివేదిక ప్రకారం.. డిజిటల్ నైపుణ్యాలకు డిమాండ్ ఉన్న లేబర్ మార్కెట్‌లో మహిళలు ఈ గ్యాప్ కారణంగా అవకాశాలు కోల్పోతున్నారు. కొవిడ్-19 మహమ్మారి రిమోట్ వర్క్‌ను మరింత సాధారణం చేసింది. ఇండియాలోని మహిళలు ప్రస్తుతం ఉన్న అంతరాన్ని అధిగమించి, వేగంగా చేరుకోగలిగితే తప్ప.. అది వారి వ్యవస్థాపకత అవకాశాలను ప్రభావితం చేస్తూ మహిళలు నిర్వహించే వ్యాపారాలను ఆహారం (food), హస్తకళలు (Handicrafts) వంటి తక్కువ ఆదాయాన్ని ఆర్జించే రంగాలతో పాటు ‘లో-టెక్‌’ (lo-tech)రంగాలకు పరిమితం చేస్తుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (Center for Monitoring Indian Economy) ప్రకారం, 2017 నుంచి 2020 మధ్య 21 మిలియన్ మహిళలు లేబర్ మ్యాప్ నుండి పడిపోయారు. 2020 చివరి నాటికి, దేశవ్యాప్తంగా శ్రామిక శక్తి స్త్రీలలో 13%, పురుషుల్లో 2% తగ్గిపోయినట్లు సదరు డేటా (data) కనుగొంది. కానీ ఈ ఏడాది ప్రారంభంలో, గత నాలుగేళ్లలో అత్యధిక స్థాయిలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని 32.5%గా గుర్తించింది. కానీ ఇది గ్రామీణ స్త్రీల శ్రామిక శక్తి పెరుగుదల, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మహిళలు చాలా తక్కువ జీతంతో కూడిన పనిని చేపట్టడానికి దారితీసింది.

(Eggs:కల్తీ కోడి గుడ్లతో సైడ్ ఎఫెక్ట్స్..)

మూడు ప్రధాన కారకాలు :
భారతదేశంలో డిజిటల్ జెండర్ గ్యాప్ అనేది ప్రధానంగా మూడు అంశాల ఫలితం.

మొదటిది గ్రామీణ (village)-పట్టణ (city)విభజన: భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తక్కువ మొబైల్ ఫోన్స్ కలిగి ఉంటారు. పట్టణ ప్రాంత మహిళల్లోనూ డిజిటల్ పేమెంట్స్(డిజిటల్ అడాప్టేషన్ వైపు ప్రాథమిక అడుగు) విషయంలో అసంఘటిత మహిళా కార్మికుల కంటే సంఘటిత వ్యక్తుల్లో సాధారణం. డేటా, సేవల ధరలే అసంఘటిత పట్టణ కార్మికుల్లో వైడర్ యూసేజ్‌ (Wider usage)ను పరిమితం చేస్తోంది.

రెండవది ఆదాయ ఆధారిత విభజన : డేటాను యాక్సెస్ చేయడం వల్ల తక్కువ-ఆదాయ కుటుంబాలు వారి నెలవారీ ఆదాయంలో 3% వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.

మూడవది సామాజిక నిబంధనలు : మొబైల్ ఫోన్లు వివాహానికి ముందు మహిళల ప్రతిష్టకు ప్రమాదంగా, వివాహానంతరం (marriage) సంరక్షణ బాధ్యతలకు అంతరాయం కలిగించే విధంగా చూసే సమాజంలో (socity)‘మహిళల ఆన్‌లైన్ యాక్టివిటీ (on line activity)తరచూ మేల్ (male) రిలేటివ్స్‌ ద్వారా నిర్వహించబడుతోంది’.

డిజిటల్ పేమెంట్స్‌కు దూరంగా..


అస్సాం, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా (Assam, Uttar Pradesh, Jharkhand, Bihar, Madhya Pradesh, Haryana)కు చెందిన 10,000 మంది గ్రామీణ, పట్టణ మహిళలపై డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ (Digital Empowerment Foundation)నిర్వహించిన 2021 అధ్యయనం ఈ విషయంలో ఆసక్తికర నిజాలు కనుగొంది. 636 మంది మహిళల్లో 82% మంది తమ సొంత వ్యాపారాలను కలిగి ఉండి కూడా డిజిటల్ లిటరసీ (Digital Literacy) పొందలేదని.. ఇంకా వారిలో 80% మంది PayTM, Google Pay లేదా Bharat Interface for Money వంటి చెల్లింపు వ్యవస్థను ఎప్పుడూ ఉపయోగించలేదని చెప్పారు. అయితే, డిజిటల్ వ్యాప్తి, స్వీకరణ పెరుగుతోంది. దానితో పాటు స్మార్ట్‌ఫోన్‌ల వాడకం కూడా పెరుగుతోందని ఉపాధి పరిష్కారాలపై దృష్టి సారించిన ప్రపంచ పరిశోధనా సంస్థ జస్ట్ జాబ్స్ నెట్‌వర్క్ (Just Jobs Network)ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సబీనా దేవాన్ (President, Executive Director Sabina Dewan)అన్నారు.

హైబ్రిడ్ వర్క్ :


మహిళల వ్యాపారాలు.. ఫుడ్, ఫ్యాబ్రిక్ వంటి తక్కువ-సాంకేతిక రంగాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. కానీ డిజిటల్ అక్షరాస్యతతో పాటు ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లు (laptop) అవసరమయ్యే హైబ్రిడ్ (Hybrid) వర్క్ మహిళలకు గేమ్ ఛేంజర్‌గా (game changer)ఉండేది. సామాజిక కోణంలో ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకపోయినప్పటికీ ఉద్యోగం వెతుక్కోవచ్చు. అయితే, ఇలాంటి సందర్భంలోనూ డిజిటల్ నైపుణ్యాలు అభివృద్ధి చెందకపోతే, వారు ఆ ఉద్యోగాలను చేయలేరు. ఇక పేమెంట్స్, ఇన్వెంటరీ నిర్వహణ, మార్కెటింగ్ డిజిటల్‌గా మారడంతో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడ్డాయి. మహిళలు సైతం ఈ ఉద్యోగాలను (jobs) చేపట్టడంలో ధీమాగా ఉన్నారు. అయితే ఢిల్లీ (Dellhi)లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతూ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్స్ చేయలేని విద్యార్థినులను (students) చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

భవిష్యత్ :


అభివృద్ధి చెందిన ప్రపంచంలో.. అంతర్జాతీయ (International) ద్రవ్య నిధి 2018 జెండర్, టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ (Future of Work) నివేదిక ప్రకారం, తక్కువ నైపుణ్యం కలిగిన క్లరికల్ (Clerical), సర్వీస్ అండ్ సేల్స్ (Service and Sales) ఉద్యోగాల్లోని మహిళా కార్మికులు ఆటోమేషన్ (Automation) ద్వారా భర్తీ చేయబడే ప్రమాదం ఉంది. ఇది విభిన్న నైపుణ్యాలు గల కొత్త తరగతి ఉద్యోగాలకు దారి తీస్తుంది. ఈ ఉద్యోగాలు పొందాలంటే మహిళలే లక్ష్యంగా సరైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. అయితే భారత్‌లోని మహిళలు 299 నిమిషాలు లేదా రోజుకు దాదాపు ఐదు గంటలు జీతంలేని ఇంటి పని కోసం గడుపుతారు. దీనివల్ల తాము సొంతంగా నేర్చుకునేందుకు, ఇంటి వెలుపల జీతంతో కూడిన పనికి తక్కువ సమయాన్ని వెచ్చిస్తారు.

(Onion:ఉల్లితో గుండెకు ప్రమాదమే..)

అందుకే డిజిటల్ అక్షరాస్యత (Digital literacy) కోసం ప్రాథమిక అక్షరాస్యత కూడా ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునేందుకు ప్రతి ఒక్కరికీ ప్రాథమిక విద్య, డిజిటల్ అక్షరాస్యత అవసరం. ఈ మేరకు ఇండియాలో డిజిటల్ అక్షరాస్యతను పరిష్కరించడానికి, ప్రభుత్వం 2015లో ప్రధాన్ మంత్రి డిజిటల్ సాక్షరత అభియాన్ (Pradhan Mantri Digital Literacy Abhiyan,), 2017లో ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్‌ (Rural Digital Literacy Campaign)ను ప్రారంభించింది. ప్రతి ఇంట్లో ఒక సభ్యునికి ప్రాథమిక డిజిటల్ అక్షరాస్యతను అందించడం ఈ కార్యక్రమాల లక్ష్యం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -