end
=
Monday, January 20, 2025
క్రీడలుభారత్‌కి తొలి పతకం
- Advertisment -

భారత్‌కి తొలి పతకం

- Advertisment -
- Advertisment -

భారత్‌కి తొలి పతకం దక్కింది. పురుషుల 55 కేజీల వెయిట్ లిప్టింగ్ విభాగంలో పోటీపడిన సంకేత్ సాగర్ గాయపడినా భారత్‌కి సిల్వర్ మెడల్‌ని అందించాడు. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. ఫురుషుల వెయిట్ లిప్టింగ్ 55 కేజీల విభాగంలో పోటీపడిన సంకేత్ సాగర్ రజత పతకాన్ని గెలుపొందాడు. సంకేత్ సాగర్ ఫస్ట్ క్లీన్ అండ్ జర్క్ అటెంప్ట్‌లో 135 కేజీల బరువుని ఎత్తి పతక రేసులో నిలిచాడు. కానీ సెకండ్ అటెంప్ట్‌లో 139 కేజీలు ఎత్తే సమయంలో అతను గాయపడ్డాడు. అయినప్పటికీ మూడోసారి గట్టిగా ప్రయత్నం చేశాడు. కానీ మోచేతి కి అయిన గాయం వల్ల నొప్పిని బరించలేకపోయాడు. దాంతో రజత పతకం తో సరిపెట్టుకున్నాడు.

మలేసియాకి చెందిన వెయిట్ లిప్టర్ బిబ్ అనిఖ్‌ 55 కేజీల వెయిట్ లిప్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాదించాడు. స్నాచ్‌లో 107 కిలోలు బరువు ఎత్తిన బిబ్ క్లీన్‌ అండ్ జర్క్‌లో 142 కిలోలు ఎత్తి మొత్తం 249 కిలోలతో స్వర్ణం గెలిచాడు. సంకేత్ సాగర్ స్నాచ్‌లో 113 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కిలోలు బరువు ఎత్తాడు. కానీ సెకండ్ అటెంప్ట్ క్లీన్ అండ్ జర్క్‌లో 139 కిలోలు బరువు ఎత్తబోతూ గాయపడ్డాడు. దాంతో 248 కిలోలు బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇక శ్రీలంక‌కి చెందిన దిలంక 225 కిలోలు బరువు ఎత్తి కాంస్యం గెలిచాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -