end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంMV Ganga Vilas:భారతదేశ మొదటి నదీ పర్యటక నౌక
- Advertisment -

MV Ganga Vilas:భారతదేశ మొదటి నదీ పర్యటక నౌక

- Advertisment -
- Advertisment -
  • ‘ఎంవీ గంగా విలాస్‌’ను ప్రారంభించనున్న మోడీ

భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ‘ఎంవీ గంగా విలాస్‌(MV ganga Vilas)’ను జనవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ వారణాసి(Varanasi)లో టెంట్ సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు. జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్(Uttapradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర కేంద్ర మంత్రులు, పలు శాఖల సీనియర్ అధికారుల సమక్షంలో జరగనున్న ఈ క్రూయిజ్ ప్రారంభ వేడుకను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ నిర్వహిస్తారు.

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా కూడా ఖ్యాతిని గడించిన ఈ నౌక గంగా, బ్రహ్మపుత్ర నదుల(Brahmaputra rivers) మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ లగ్జరీ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్‌ గదులు, స్పా, జిమ్‌ సెంటర్లు, ఫ్రెంచ్ బాల్కనీలు, LED టీవీలు, సేఫ్‌లు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్లు వంటివి కూడా ఉన్నాయి. 51 రోజుల(51 Days) పాటు సాగే తన మొదటి పర్యటనను వారణాసి నుంచి ఈ రోజే ప్రారంభించనున్న ఎంవీ గంగా విలాస్ .. భారత్‌లోని ఐదు రాష్ట్రాలను, బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,200 కి.మీ దూరం ప్రయాణించి దిబ్రూఘర్ చేరుకుంటుంది. అంతేకాక 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది. ఇక ఈ నౌక తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా(Kolkata), బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. ఎంవీ గంగా విలాస్ తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది.

కోల్‌కతాకు చెందిన అంటారా సంస్థ లగ్జరీ రివర్ క్రూజ్‌(luxury river cruise) ఆపరేట్ చేస్తోంది. ఈ షిప్ ఈ క్రూజర్‌లో మూడు డెక్‌లు, 18 లగ్జరీ సూట్‌లు ఉంటాయి. ఇందులో 36 మంది పర్యాటకులు వెళ్లొచ్చు. 40సీటర్ మల్టీ కుజిన్ రెస్టారెంట్, మోడర్న్ స్పా, లైవ్ మ్యూజిక్, 40 క్రూ మెంబర్స్ ఉంటారు. 62 మీటర్ల పొడవున్న ఈ నౌకలో కాలుష్య రహిత వ్యవస్థలు, నాయిస్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటుంది. జనవరి 13న వారణాసిలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించిన తర్వాత ఈ నౌక తన తొలి ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌(Switzerland)కు చెందిన 32 మంది ప్రయాణికులు పర్యటించనున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వీరు మార్చి 1న దిబ్రూగఢ్‌ చేరుకుంటారని తెలిపారు. మరి ఇంత ప్రత్యేకమైన ఈ గంగా విలాస్‌ టికెట్ ధర ఎంతో తెలుసా..? ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు. అంటే ఈ యాత్ర మొత్తానికి రూ.12.75లక్షల ఖర్చవుతుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రూజ్‌లో వెళ్లే పర్యాటకులు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, జాతీయ ఉద్యానవనాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, పాట్నా, గౌహతి, కోల్‌కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరాలు కవర్ అవుతాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -