end
=
Sunday, January 19, 2025
క్రీడలుభారత్‌దే తొలి టీ20
- Advertisment -

భారత్‌దే తొలి టీ20

- Advertisment -
- Advertisment -

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇండియా నిర్ధేశించిన 162 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్‌ ఛేదించలేక చతికిలపడింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు షార్ట్(38 బంతుల్లో 34; 3 ఫోర్లు), కెప్టెన్‌ ఫించ్‌(26 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్సర్‌) జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చారు. వారిద్దరూ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చాహల్‌ విడగొట్టాడు. అనంతరం ఫుల్‌ ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను సైతం చాహల్‌ బొల్తా కొట్టించాడు. తొలి వికెట్ భాగస్వామ్యం అనంతరం ఆసీస్‌.. ఏ దశలోనూ కోలుకోలేదు. మధ్యలో హెన్రిక్స్‌(20 బంతుల్లో 30;1 ఫోర్‌, 1 సిక్సర్‌) గెలుపుపై ఆశలు రేపాడు. కానీ, అతడిని దీపక్‌ చాహర్‌ ఎల్బీగా పంపాడు. అప్పుడే మ్యాచ్‌ భారత్‌ చేతిలోకొచ్చింది. భారత బౌలర్లలో నటరాజన్‌, చాహల్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. చాహర్‌ ఓ వికెట్ పడగొట్టాడు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్‌ కె ఎల్‌ రాహుల్‌(40 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్సర్‌), జడేజా(23 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించారు. సామ్సన్‌(23), పాండ్యా(16) పర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో హెన్రిక్స్‌ 3, స్టార్క్‌ 2 వికెట్లు, స్వెప్సన్‌, జంపా తలా ఓ వికెట్ తీశారు. ఆసీస్‌ కీలక వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర వహించిన చాహల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 6న జరగనుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -