మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ జట్టుకి కనీస పోటీని ఇవ్వని ఇంగ్లాండ్. దాంతో భారత్ జట్టు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైపోగా లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 114/0తో టీమిండియా ఛేదించేసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా రెండో వన్డే గురువారం సాయంత్రం 5:30 గంటలకి లార్డ్స్‌లో జరగనుంది. టీమిండియాతో ఒక వన్డే మ్యాచ్‌లో అత్యంత తక్కువ స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయిన నాలుగో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.