end
=
Thursday, November 21, 2024
వార్తలురాష్ట్రీయంSteel Bridge : ఇందిరాపార్కు-విఎస్టీ స్టీల్ బ్రిడ్జి ప్రారంభం
- Advertisment -

Steel Bridge : ఇందిరాపార్కు-విఎస్టీ స్టీల్ బ్రిడ్జి ప్రారంభం

- Advertisment -
- Advertisment -

– ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్డు(RTC Cross Roads) వద్ద ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌

KTR : దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్‌ బ్రిడ్జిని(Steel Bridge) తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ (IT Minister KTR) శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇందిరా పార్కు(Indira Park to VST) నుండి విఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్‌ సమస్యలు(Traffic Issues) తగ్గనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కాగా హైదరాబాద్‌లో ఇది 36వ ఫ్లైఓవర్‌గా పేర్కొన్నారు. రూ.450 కోట్లతో 2.63 కి.మీల పొడవైన వంతెన నిర్మించినట్లు తెలిపారు.

indira park to vst steel bridge

ఈ బ్రిడ్జ్‌ వల్ల రామ్‌నగర్‌(Ramnagar), విద్యానగర్‌(Vidyanagar), అంబర్‌పేట(Amberpet), తిలక్‌నగర్‌(Tilaknagar), ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) వెళ్లే వారికి ఎటువంటి ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చాలా సులభంగా గమ్యాలకు చేరుకుంటారని వివరించారు. అంతేగాకుండా ఈ స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహ్మారెడ్డి (Naini NarsimhaReddy)పేరును పెట్టాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదేశించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ర్ట సాధనలో, అభివృద్ధిలో నాయిని నర్సింహ్మారెడ్డి చేసిన సేవలకు గాను ఆయన పేరును స్టీల్‌ బ్రిడ్జికి పెట్టనున్నట్లు తెలిపారు.

ఇదిలావుండగా బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party), తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) హైదరాబాద్‌లో చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని కొందరు మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. వచ్చే ఎలక్షన్‌లలో కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచే తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -