Sleepless: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో అసలు పూర్తి విశ్రాంతి కరువైంది. ఏదో వారాంతపు సెలవు ఉన్నట్టే ఉంటుంది కానీ ఏవేవో పనుల కారణంగా ఆరోజు కూడా ఇక అంతే. దీనికి తోడు నిద్రలేమి సమస్యల వల్ల శరీరం ఇంకా అలసిపోయి ఆఫీసుల్లో, లేదా ఇంటి పనుల్లో కూడా యాక్టివ్‌గా పనిచేయలేకపోతున్నారు. మనిషికి కచ్చితంగా 8 గంటల నిద్ర(Sleep) అవసరం. అందులో 5 గంటలు గాఢ నిద్ర (Deep Sleep) పడితే కొండంత బరువును నేలమీద దించినట్లవుతుంది. శరీరం చాలా ఉత్తేజంగా ఉంటుంది. అలాగే మానసికంగా(Mental Health) కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ ఎంత మంది సంతృప్తికరంగా నిద్రపోతున్నారు? చాలా తక్కువ అనే చెప్పవచ్చు. నిద్రలేమి వల్ల హార్మోన్‌ల విడుదలలో తేడాలొస్తాయి. మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మతిమరుపు(alzheimer’s) మొదలవుతుంది. మొమోరి పవర్ కూడా సన్నగిల్లుతూ ఉంటుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి కచ్చితంగా 8 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
- పడుకునే గంట ముందే డిన్నర్ చేయాలి.
- మొబైల్స్‌ను సైలెంట్‌లో పెట్టి హాల్‌లో గానీ, లేక వేరే ఇతర చోట్ల పెట్టేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్‌లో పెట్టకూడదు.
- ప్రతీ రోజు 10 గంటల లోపు పడుకోవడానికి ప్రయత్నించాలి.
- నిద్రరాకపోతే ఏదో ఒక పుస్తకం చదువుతూ(Book Reading) ఉండాలి
- గోరు వెచ్చని పాలు(Warm Milk) తాగాలి
- ముఖ్యంగా బెడ్‌ను చాలా నీట్‌గా సర్దుకోవాలి. చిందరవందరగా ఉండకూడదు.
- పుసుపు రంగులో ఉండే బల్బ్‌ను డిమ్ లైట్ వచ్చేలా సెట్ చేసుకోవాలి.
- రాత్రి పూట బిర్యానీలు, హెవీ ఫుడ్ తీసుకోవద్దు. చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి
- టీ, కాఫీ, కెఫిన్ సంబంధిత పానీయాలు తీసుకోకూడదు. వీలైతే గ్లాసు మజ్జిగ తాగవచ్చు.
- మీ బెడ్‌రూమ్ పక్కల సౌండ్ పొల్యూషన్ లేకుండా చూసుకోండి.
(Walking Benefits : వాకింగ్ వల్ల ప్రయోజనాలు)
నైట్ డ్యూటీలు చేసే ఉద్యోగులు పగలు ఎలా ప్రశాంతంగా నిద్రపోవాలో మరో టిప్స్‌లో తెలుసుకుందాం….