- రూ. 7 కోట్ల వరకు మోసం
- ఇన్సూరెన్స్ ఏజెంట్ల నిర్వాకం
- రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులే టార్గెట్
ఇన్సూరెన్స్ ఏజెంట్‌లతో జర జాగ్రత్త. ఎందుకంటే నకిలీ రసీదులో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు కొందరు బడా కంపెనీల బీమా ఏజెంట్లు. తాజాగా హైదరాబాద్‌లో ముగ్గురు బీమా ఏజేంట్లు ఏకంగా 7 కోట్ల రూపాయల వరకు నకిలీ రసీదులతో సొమ్ముకొల్లగొట్టారు. విశ్రాంత అధికారులను లక్ష్యంగా చేసుకున్న ముగ్గురు ఇన్సూరెన్స్ ఏజెంట్లు సుబ్రహ్మణ్యం, మనోజ్, మహేశ్‌గౌడ్ పాలసీల పేరుతో నకిలీ రసీదులు ఇచ్చి సుమారు 7 కోట్ల వరకు స్వాహా చేశారు.
మోతీనగర్‌కు చెందన జగపతిరావు నుండి రూ.4.94 కోట్లు, మరో బాధితుడి నుండి రూ.1.60 కోట్లు స్వాహా చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు నింధితులు గత రెండు సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగులు, అధికారులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని నకిలీ రసీదులు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
గోదావరి నదిలో విద్యార్థులు గల్లంతు