- సెప్టెంబర్ 17 నుండి 30 వరకు తొలి విడత అడ్మీషన్లు
- సెప్టెంబర్ 18 నుండి ఆన్‌లైన్‌లో ఇంటర్ తరగతులు
- మార్గదర్శకాలను విడుదల చేసిన ఇంటర్ బోర్డు
2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ అడ్మీషన్ల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి తొలి విడత నోటిఫికేషన్‌ను ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్‌జలీల్ బుధవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 30 వరకు ఇంటర్ అడ్మీషన్లు నిర్వహించాలని ఇంటర్ కాలేజీలకు సూచించారు. అయితే సెప్టెంబర్ 18 నుండి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చారు. కరోనావైరస్ నేపథ్యంలో రెగ్యులర్ తరగతులు నిర్వహించలేని కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వినాల్సి ఉంటుంది.
ఇదిలావుండగా జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పదో తరగతికి సంబంధించి ఇంటర్నెట్ ఆధారిత మెమోను అంగీకరించాలని కాలేజీ యాజమాన్యాలకు బోర్డు సూచించింది. విద్యార్థులు ఓరిజినల్ మెమోలు పొందిన తర్వాత కాలేజీలో ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ మెమో, టీసీ సమర్పించాలని తెలిపింది. ఇంటర్ అడ్మీషన్ల ప్రక్రియలో కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా రిజర్వేషన్లు పాటించాలని ఉత్తర్వులో ఇంటర్ బోర్డు సూచించింది. ఇదేగాకుండా ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలలు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని హెచ్చరిచింది.
సినీ నటుడు నాగబాబుకు కరోనా పాజిటివ్
ఇంటర్మీడియట్ బోర్డు అడ్మీషన్ మార్గదర్శకాలు
- విద్యార్థులు అఫిలియేషన్ పొందిన జూనియర్ కాలేజీలో మాత్రమే ప్రవేశాలు పొందాలి. అనుబంధ కాలేజీల వివరాలకు acadtsbie.cgg. gov.in, tsbie.cgg.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలి.
- అనుమతి పొందిన కోర్సులు, సెక్షన్లకు మాత్రమే ప్రైవేటు కాలేజీలు ప్రవేశాలు నిర్వహించాలి. ప్రతి విభాగంలో 88 కంటే ఎక్కువమంది విద్యార్థులను తీసుకోవద్దు. బోర్డు రద్దు చేసిన కాంబినేషన్లతో ప్రవేశాలు చేయవద్దు.
- రాష్ట్రంలోని ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, సోషల్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్, మోడల్ స్కూల్, ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశం పొందాలనుకు నే విద్యార్థి ఆధార్ నంబరును సమర్పించాలి.
- అర్హత పరీక్షల రికార్డుల్లో ఉన్న జోగిని పిల్లలకు సంబంధించి తండ్రి పేరుకు బదులు తల్లి పేరు చేర్చాలి.
- ప్రతి జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి బోర్డు మంజూరు చేసిన కోర్సులు, సెక్షన్లు, సీట్ల వివరాలను నోటీసు బోర్డులో అందరికీ తెలిసేలా పెట్టాలి. నిండిన సీట్లు, ఖాళీల వివరాలు ప్రతి రోజూ నోటీసు బోర్డులో ఉంచాలి.
- అడ్మిషన్ల కోసం ప్రకటనలు జారీ చేయవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు అనివార్యం.