end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంHeart Attack: గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి
- Advertisment -

Heart Attack: గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

- Advertisment -
- Advertisment -

గుండెపోటు(Heart Attack)తో ఇంటర్‌ విద్యార్థిని(Intermediate Student) మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్‌ (Karimnagar) జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లిలో(Nyalakondapally) జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… న్యాలకొండపల్లికి చెందిన గుండు అంజయ్య(Anjaiah), శారద దంపతుల కుమార్తె ప్రదీప్తి (16)(Padeepthi) ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో(Adarsh Junior College) ఇంటర్‌ మొదటి సంవతరం చదువుతోంది.

అయితే శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్‌డే(Freshers Day) నిర్వహించారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థులతో పాటు ప్రదీప్తి డ్యాన్స్‌(Dance) చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు, అక్కడ ఉన్న కళాశాల సిబ్బంది సీపీఆర్‌(CPR) చేయడానికి ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి(Government Hospital) తరలించారు. కానీ దురదృష్టావశాత్తు ప్రదీప్తి (Pradeepthi Died) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇదిలావుండగా ప్రదీప్తికి చిన్నప్పటి నుండే గుండెకు రంధ్రం (Heart hole) ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించలేకపోయామని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.


ఇవి కూడా చదవండి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -