ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 2020 సంవత్సరానికి గానూ భారతీయ నెటిజన్స్ అత్యధికంగా శోధించిన జాబితాను రిలీజ్ చేసింది. భారతీయులు నెట్టింట్లో ఎక్కువగా ‘ఐపీఎల్’ గురించే వెతికారని గూగుల్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ‘కరోనా వైరస్’ చోటు దక్కించుకుంది. ఎక్కువమంది రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఆరోగ్యకరమైన వంటల గురించి వెతికారట. నియర్‌మీ లో ఆహార వసతి, కరోనా టెస్ట్, టపాసులు, మద్యం కోసం విపరీతంగా వెతికారట ఇండియన్ నెటిజన్స్.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్, అమెరికా ఎన్నికల ఫలితాలు, కొబె బ్రయంట్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ వెల్లడించింది. ఇక్కడ విశేషమేమంటే ప్రతి ఏడాది నెటిజన్స్.. సినీ సెలెబ్రిటీలు, పోర్న్ స్టార్స్, క్రీడాకారులు, డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఛాంపియన్స్ గురించి వెతికేవారు. కానీ, ఈ ఏడాది.. కరోనా పుణ్యమాని వారి జోలికెళ్లలేదు నెటిజన్లు.